Harish Rao: కాంగ్రెస్ నేతల యాత్రలన్నీ అందుకోసమే.. మండిపడ్డ హరీశ్ రావు

హరీశ్ రావు(ఫైల్ ఫోటో)

Harish Rao: జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజలకు ఏం చేశాని హరీశ్ రావు ప్రశ్నించారు. జాతీయ పార్టీల్లో పని చేసే నాయకులకు ఢిల్లీలో గులాం గిరి చేయడమే సరిపోతుందని ఎద్దేవా చేశారు.

  • Share this:
    తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కుర్చీల కోసమే రైతు యాత్రలు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే తిన్నది అరగక చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు అనలేదా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో ఎరువుల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు బంధు, ఉచిత కరెంట్ , రైతు భీమా లాంటి సంక్షేమ పథకాల ఊసే లేదని అన్నారు. టీఆర్ఎస్ పథకాల గురించి కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీకి చెప్పాలని, ఆప్పుడైనా కాంగ్రెస్ బాగుపడుతుందని హరీశ్ రావు అన్నారు.

    మెదక్‌లో ఆదివారం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ఉద్యమకారులుగా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో కార్యకర్తలు కీలకపాత్ర పోషించారని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా 48 గంటల రైల్ రోకో కార్యక్రమం చేపట్టారని అన్నారు. కార్యకర్తలు అభివృద్ధి విషయంలో పోటీ పడినట్లు, సభ్యత్వ నమోదు విషయంలోనూ పోటీపడాలని హరీశ్ రావు సూచించారు. టీఆర్ఎస్ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా తీసుకుంటున్నారని అన్నారు. ప్రజల్లో తమ పార్టీకి ఉన్న విశ్వసనీయతకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

    ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజలకు ఏం చేశాని హరీశ్ రావు ప్రశ్నించారు. జాతీయ పార్టీల్లో పని చేసే నాయకులకు ఢిల్లీలో గులాం గిరి చేయడమే సరిపోతుందని ఎద్దేవా చేశారు. తమ పాలనలో పాలమూరులో వలసలు తగ్గిపోయాయని.. ఘనపురం కాల్వలు బాగుపడ్డాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: