• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HARISH RAO AND OTHER MINISTER GIVEN KEY RESPONSIBILITIES IN TELANGANA MLC ELECTIONS BY CM KCR AK

Telangana: హరీశ్ రావు సహా పలువురు మంత్రులకు కీలక బాధ్యతలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం

Telangana: హరీశ్ రావు సహా పలువురు మంత్రులకు కీలక బాధ్యతలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం

కేసీఆర్, హరీశ్ రావు (ఫైల్ ఫోటో)

Telangana: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను సీఎం కేసీఆర్ ముగ్గురు మంత్రులకు అప్పగించారు.

  • Share this:
    తెలంగాణలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతేడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించినట్టుగా రాని ఫలితాలతో టీఆర్ఎస్ నాయకత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి చెక్ పెట్టాలని వ్యూహరచన చేస్తుండటం.. మరోవైపు ఇతర విపక్షాలు, ఇండిపెండెంట్లు సైతం రంగంలో ఉండటంతో అధికార పార్టీ ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే నేడు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను పలువురు మంత్రులకు అప్పగించినట్టు తెలుస్తోంది.

    మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను సీఎం కేసీఆర్ ముగ్గురు మంత్రులకు అప్పగించారు. హైదరాబాద్‌కు గంగుల కమలాకర్, రంగారెడ్డికి హరీశ్ రావు, మహబూబ్ నగర్ బాధ్యతలను మంత్రి ప్రశాంత్ రెడ్డికి అప్పగించినట్టు సమాచారం. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను సైతం పలువురు మంత్రులకు అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ డివిజన్ల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలకు గెలుపు బాధ్యతలను అప్పగించింది టీఆర్ఎస్ నాయకత్వం.

    అయితే చాలామంది నేతలు తమకు కేటాయించిన డివిజన్లలో టీఆర్ఎస్‌ను గెలిపించలేకపోయారు. అయితే ఈసారి మాత్రం ఎన్నికలను అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని.. టీఆర్ఎస్ అభ్యర్థి కచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించిన నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఎవరూ అలసత్వం వహించినా.. ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ సవాల్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు