ఆ వ్యాధిగ్రస్తులకు షాకింగ్ న్యూస్.. ఈసారి చేప ప్రసాదం బంద్..

ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఈ నెల 29తో ముగిసినా.. తర్వాతి పరిస్థితుల ఆధారంగా జూన్‌లో పొడిగించినా తాము మాత్రం ఈసారి చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: May 10, 2020, 10:28 PM IST
ఆ వ్యాధిగ్రస్తులకు షాకింగ్ న్యూస్.. ఈసారి చేప ప్రసాదం బంద్..
చేప ప్రసాదం పంపిణీ
  • Share this:
కరోనా వైరస్ రోజురోజూకీ విస్తరిస్తున్న తరుణంలో ఎప్పుడు పూర్తిగా నయం అవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి ఈ సమయంలో తమ కుటుంబం వందల సంవత్సరాలుగా ఆస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున వేసే చేప ప్రసాదం ఈ సంవత్సరం వేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన అన్ని ప్రచార సంస్థలకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. యావత్ ప్రపంచ మానవాళిని గృహ నిర్బంధం చేయిస్తూ అందిన వారిని అంతమొందిస్తున్న మహమ్మారి కరోనా ప్రభావానికి ఏ మందూ లేదు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత దూరం పాటించడం తో పాటు ప్రతి క్షణం పరిశుభ్రత పాటించడమూ, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడమే రక్షణ అని బత్తిని హరనాథ్ గౌడ్ అన్నారు. ఏటా దేశ విదేశాల నుంచి వేలాది మంది మా చేప మందుకోసం హైదరాబాద్ వస్తుంటారని, ఈ సంవత్సరం మాత్రం ఎవ్వరు రావద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఈ నెల 29తో ముగిసినా.. తర్వాతి పరిస్థితుల ఆధారంగా జూన్‌లో పొడిగించినా తాము మాత్రం ఈసారి చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు. తమ పేరుతో ఎవరైనా చేప మందు ఇస్తామని ప్రకటిస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, తక్షణం మాకు గానీ పోలీసులకు గాని తెలియజేయాలని బత్తిని హరనాథ్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏటా మాకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. ఇతర స్వచ్ఛంద సంస్థలు, బద్రివిషాల్ పన్నాలాల్ పిట్టి ట్రస్ట్, అగ్రవాల్ సేవా సంగ్ సభ్యులు అందించే సహకారం ఎన్నడూ మరువలేనిదని, వారందరికీ ఈ ప్రకటన ద్వారా ప్రత్యేకంగా ఈ సమాచారాన్ని తెలియచేస్తున్నట్లు హరినాథ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం బత్తిని చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని ప్రజలందరూ గ్రహించాలని కోరారు.

Published by: Narsimha Badhini
First published: May 10, 2020, 10:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading