Happy Ramzan :రేపే రంజాన్, ఎవరి ఇంట్లో వారే ప్రార్థనలు, శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు

రంజాన్ శుభాకాంక్షలు, ఎవరి ఇంట్లో ప్రార్థనలు, మంత్రి హరీష్ రావు

Happy Ramzan : ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ పండుగ పురస్కరించుకుని జిల్లా ప్రజలకు , ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి హరీష్ రావు గారు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

  • Share this:

  • ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్‌ను శుక్రవారం  నిర్వహించుకోనున్నారు.ఈ సంధర్భంగా  పండుగ పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు , ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి హరీష్ రావు గారు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ పవిత్రతకు ,త్యాగానికి చిహ్నమని , పండుగను భక్తి శ్రద్దలతో , ఆనందోత్సవాలతో జరుపుకోవలన్నారు. సేవాదృక్పథ భక్తి ప్రవృతులు , సోదరభావాలు మత సామరస్యాన్ని చాటి చెప్పే ఈ పండుగను ముస్లిం సోదరులు సంతోషం గా జరుపుకోవాలని ఆకాంక్షించారు...


రంజాన్ పండుగను రాష్ట్ర పండుగగా మన ప్రభుత్వం గుర్తించిందన్నారు.. కరోన వ్యాప్తి నేపథ్యంలో ఈ పండుగను సామూహికంగా జరుపులేక పోతున్నాం అని. ఎవరి ఇంట్లో వారే వేడుకగా జరుపుకుని యావత్ ప్రపంచ ప్రజలు అందరం బాగుండాలి అని కరోనా మహమ్మారి భారీ నుండి అందరం బయట పడాలని ఆ అల్లాని ప్రార్ధించాలని కోరారు. సిద్దిపేట లో పేద ముస్లిం లకు రంజాన్ తోఫా ను అందించాం అని , మైనార్టీ ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుంది ..ముస్లిం ల కొరకు అనేక కార్యకమాలు చేసుకుంటున్నాం అని అన్నారు....రంజాన్ మాసమంతా ప్రపంచ వ్యాప్తంగా నిష్టతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

కాగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో ముస్లింలు లాక్డౌన్ ఆంక్షలు సడలించాలని కోరుతున్నారు.అయితే ఇప్పటికే మతపరమైన కార్యక్రమాలను అనుమతులను ప్రభుత్వం నిలిపి వేసింది. మరి వేల కొలది ముస్లింలు ఆయా మసీదుల్లో ప్రార్థనలు కొనసాగిస్తారా లేదంటే ఎవరి ఇంట్లో వారే ప్రార్థనలు చేసుకుంటారా అనేది వేచి చూడాలి.
Published by:yveerash yveerash
First published: