హోమ్ /వార్తలు /తెలంగాణ /

National Handloom Day 2022: చేయి లేదు.. కాలు పనిచేయదు.. కానీ వీళ్లుచేసే పని చూస్తే శభాష్​ అనక మానరు..

National Handloom Day 2022: చేయి లేదు.. కాలు పనిచేయదు.. కానీ వీళ్లుచేసే పని చూస్తే శభాష్​ అనక మానరు..

చేనేత పని చేస్తున్న దివ్యాంగుడు

చేనేత పని చేస్తున్న దివ్యాంగుడు

అంగ వైకల్యం ఉన్నా చేనేత వృత్తిలో ప్రావీణ్యం సంపాదిస్తూ రాణిస్తున్నారు . జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా న్యూస్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం ..

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  (Sayyad Rafi, News18, Mahbubnagar)

  వేల పోగులను చేతులతో ఆడిస్తూ కంటికి కనిపించని దారాలను వేళ్ళతో పట్టుకొని బరువైన జాకార్డ్ యంత్రాలను కాళ్లతో తొక్కుతూ రోజంతా పనిచేస్తే వారం నుంచి 15 రోజుల వ్యవధిలో అందమైన చీరను తయారు చేస్తారు నేతన్నలు. ఇవన్నీ కాళ్లు, చేతులు, కళ్ళు సక్రమంగా పనిచేసినప్పుడే సాధ్యమవుతుంది. ఇంతటి కష్టతరమైన పనిని సైతం దివ్యాంగులు (Handicap) ఆకట్టుకునేలా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చేనేత వృత్తిలో (Handloom profession) ప్రావీణ్యం సంపాదిస్తూ రాణిస్తున్నారు ఆ చేనేత కార్మికులు. జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం (National Handloom Day 2022) సందర్భంగా న్యూస్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం ..

  ఒకే చేత్తో నెలకు మూడు చీరలు..

  ఒక చేయి సహకరించకపోయినా అధైర్య పడకుండా ఎడమ చేతితో ఏళ్లుగా మగ్గం నేస్తున్నాడు జోగులాంబ గద్వాల (Jogulamba gadwal) జిల్లా రాజోలికి చెందిన శ్రీకాంత్. పుట్టుకతోనే మణికట్టు నుంచి చేతికి వెళ్ళు ఉండని ఇతను ఒకే చేత్తో ఇరువైపులా కదులుతూ నెలకు మూడు చీరలు నేస్తున్నారు. టర్నింగ్ చీర అంటేనే ఇద్దరు మనుషులు అవసరం. శ్రీకాంత్ మాత్రం చెయ్యి సరిగా లేకున్నా సునాయాసంగా మగ్గం చేయగలరు. అంతేకాక కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అవసరమైనప్పుడు ఎలక్ట్రిషన్ గా కూడా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మగ్గం నేయాలనే ఆసక్తి ఉందని తమలాంటి వారికి ప్రత్యేకంగా చేనేతకు పథకాలు ప్రోత్సాహం లేకుండా పోయిందని శ్రీకాంత్ చెప్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నేతన్న పథకం కింద తమ లాంటి వికలాంగులకు సహకరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు శ్రీకాంత్.

  కుటుంబ పోషణకు చిన్ననాటి నుంచి : ఈరన్న చేనేత కార్మికుడు

  జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామానికి చెందిన ఈరన్నకు చిన్నప్పటి నుంచి కాళ్లు పనిచేయదు నడుం కూడా ముంగిపోయి ఉంటుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం చదువు కోకపోవడంతో చిన్నప్పటి నుంచి మగ్గం పనిలో ఉన్నాడు. ఒక కాలుతోనే టర్నింగ్ పట్టు చీరలు తయారు చేస్తాడు. దారాలు చుట్టడం నేయడం ఇలా మొత్తం తానే చేసుకుంటూ నెలకు 4 చీరలతో 15 వేల వరకు సంపాదిస్తూ కుటుంబ పోషణ చేస్తున్నాడు ఈరన్న. కనీసం రాయితీపై తమకు అవసరమైన పరికరాలు అందించాలని ప్రభుత్వాన్ని ఈరన్న కోరుతున్నాడు.

  ఓకే కాలుతో 15 సంవత్సరాలుగా మగ్గం..

  జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం అరగిద్దకు చెందిన రాఘవేంద్రకు చిన్నప్పుడే పోలియో కారణంగా కాళ్లు పనిచేయవు. తల్లిదండ్రుల వృత్తి చేనేత కావడంతో చిన్నప్పటినుంచి దానినే ఇష్టంగా నేర్చుకున్నాడు. ఒక కాలుతో 15 సంవత్సరాలుగా మగ్గం నేస్తున్నాడు. బరువైన జార్ఖండ్ను ఒకే కాల్ తో తొక్కడం అణువు లేట్ చేసేందుకు చెక్కలనే అదే కాలితో తొక్కుతూ టర్నింగ్ ఆర్డర్ కొట్టు మగ్గం నేస్తున్నాడు. రాఘవేంద్ర అతనికి ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ భార్య వృద్ధురాలైన అమ్మ పోషణ తానే చూసుకుంటున్నాడు. ఒకే కాలు ఉండటంతో వేగంగా మగ్గం నేయలేడు. అందుకే కొట్టు మగ్గాన్ని ఎంచుకున్నానని రెండు నెలలకు మూడు చీరలు మాత్రమే నేస్తానని రాఘవేంద్ర అని చెప్తున్నాడు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ పథకం ద్వారా మాలాంటి వారికి లబ్ధి చెరుకూర్చాలని ప్రాధేయపడ్డాడు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Handloom, Mahabubnagar

  ఉత్తమ కథలు