Home /News /telangana /

Adilabad : గుస్సాడీ గురువుకు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం..

Adilabad : గుస్సాడీ గురువుకు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం..

Adilabad : గుస్సాడీ గురువుకు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం..

Adilabad : గుస్సాడీ గురువుకు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం..

Adilabad : అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనుల సాంస్కృతిక చిహ్నం, ప్రాచీన కళ గుస్సాడి. ఆ కళను జాతీయ స్థాయిలో ప్రదర్శించడమే కాకుండా అది అంతరించిపోకుండా నేటి తరానికి గుస్సాడీలో తర్ఫీదునిస్తూ ఆ కళకే అంకితమైన కనక రాజుకు అరుదైన గౌరవం దక్కింది.

ఇంకా చదవండి ...
    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల చారిత్రక గ్రామమైన మార్లవాయి గ్రామానికి చెందిన కనక రాజు ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. నేడు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని కనక రాజు అందుకోబోతున్నారు. ఈ మేరకు అందిన ఆహ్వానం తో కనక రాజు ఢీల్లీకి చేరుకున్నారు.

    ఇదిలా ఉంటే వృత్తి రీత్యా ఆశ్రమ వసతి గృహంలో కుక్ మెన్ విధులను నిర్వహిస్తున్న కనక రాజు కొన్ని దశాబ్దాలుగా గుస్సాడి కళకు అంకితమై విశేషమైన సేవలను అందిస్తున్నారు. ప్రతి యేటా దీపావళి పండుగ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గూడాల్లో జరుపుకునే దండారి ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శించే ఈ గుస్సాడి నృత్యంలో యువతకు శిక్షణనిస్తున్నారు. అంతే గుస్సాడి వేషధారణలో ధరించే నెమలి టోపిలను తయారు చేయడంలోనూ రాజు నేటి తరానికి మెళకువలను నేర్పుతున్నారు.

    ఇది చదవండి : 19 మంది మహిళలను మోసం చేసిన ఫ్రాడ్.. రెండో భార్య ఫిర్యాదులో వెలుగులోకి..


    అంతేకాకుండా కనక రాజు 1981వ సంవత్సరంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, రాష్ట్రపతి హాయాంలో ఢిల్లీలోని ఎర్రకోట లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో తన బృందంతో గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఇదిలా ఉంటే నేడు రాష్ట్రపతి భవన్ లో జరిగే పురస్కార ప్రధానోత్సవ వేడుకలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునేందుకు ఢీల్లీకి చేరుకున్న కనక రాజుకు తెలంగాణా రాష్ట్ర భవన్ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసులు బృందం ఘనంగా స్వాగతం పలికి సన్మానించింది.

    ఇది చదవండి :  వలలో చిక్కిన జలకన్య -మైపాడు బీచ్‌లో గిలగిలా కొట్టుకుంటూ -అసలేం జరిగిందంటే..


    అనంతరం కనక రాజు దేశ రాజధానిలోని జాతిపిత మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్ ను సందర్శించి అంజలిఘటించారు. అలాగే మాజీ ప్రధాన మంత్రులు జవహార్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల సమాధులను సందర్శించి నివాళులు అర్పించారు. ఇందిరాగాంధీ హాయాంలో ఢిల్లీలో ఇచ్చిన ప్రదర్శన తాలూకూ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఏదిఏమైనప్పటి మారుమూల గిరిజన గ్రామానికి చెందిన ఓ సాధారణ గుస్సాడి నృత్య కళాకారుడికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారం దక్కడంతో అడవి బిడ్డలు మురిసిపోతున్నారు
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Delhi, Padma Shri

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు