ఇలా భద్రాద్రి కొత్తూగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఓ ఘోరం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా తీవ్రమైన లైంగిక వేధింపుల వల్లే ఆమె ఒకరికి బలవంతంగా దగ్గర కావాల్సి వచ్చినట్టు.. దీనిని ఓర్వలేని మరొక ఉపాధ్యాయుడు ఆమెను టార్గెట్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలియగానే ఆమెతో ఏకాంతంగా ఉన్న వైస్ ప్రిన్సిపల్ పరారవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. సువర్ణపాక కళ్యాణి, వయసు 26. ఆమె ఓ ఉపాధ్యాయురాలు. సొంతూరు ఇల్లెందు మండలం రొంపేడు. అతను వైస్ ప్రిన్సిపల్ మన్మధరావు. ఇద్దరూ అన్నపురెడ్డిపల్లి ప్రభుత్వ గురుకుల కళాశాలలో పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు. చనువు ఏర్పడింది. తరచూ మాట్లాడుకునేవాళ్లు. ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునేవాళ్లు. అలా దగ్గరయ్యారు. ఒకే చోట పనిచేస్తారు.. ఒకే ప్రాంగణంలో నివాసం ఉంటారు. దీంతో సమయం దొరికినపుడు ఎక్కడో ఒక దగ్గర కలుస్తుంటారు. అలా గురువారం సాయంత్రం ఆమె, అతను ఒకే రూంలో ఉ కాస్త ఏకాంతంగానే ఉన్నారు.
అదే సమయంలో వీరిద్దరిని మరో ఉపాధ్యాయుడు వీడియో తీశాడు. తామిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో అతను వీడియో తీయడంతో ఆమె బాగా హర్ట్ అయింది. వీడియో తీసిన ఉపాధ్యాయునికి, ఈ ఇద్దరికి మధ్య కాసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఓ పక్క విద్యార్ధులకు రీడింగ్ అవర్స్ నడుస్తుంటే మీరిద్దరూ గదిలో ఏంచేస్తున్నారంటూ ప్రశ్నించడంతో ఆమె బాగా ఇబ్బంది పడింది. ఏంచేయాలో.. బయటకు తెలిస్తే పరువు ఎక్కడ పోతుందో.. ఇంట్లో వాళ్లకు ఎలా సమాధానం చెప్పుకోవాలో అర్థం కాక తల్లిడిల్లిపోయింది. నేరుగా తన క్వార్టర్‌కు వెళ్లిపోయింది. ఒంటరిగా కాసేపు ఏడ్చింది. భవిష్యత్ అంధకారంగా తోచింది. ఆ సమయానికి ఆమెకు భరోసా ఇచ్చేవాళ్లు కూడా లేకపోవడంతో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
Breaking : మరో ఐదు కార్పోరేషన్లకు చైర్మన్లు.. నియమించిన సీఎం కేసీఆర్..వాళ్లు ఎవరంటే..
ఇలా విద్యార్ధులు, గురువులు ఒకే చోట నివాసం ఉంటూ వారిలో జీవితం పట్ల, భవిష్యత్ పట్ల ఆశావహ దృక్ఫధాన్ని పెంపొందించడం, లక్ష్యసాధన దిశగా ముందుకెళ్లడం లాంటివి నేర్పాల్సిన ఉపాధ్యాయులు తామే చిన్నచిన్న బలహీనతలకు లొంగిపోతున్న పరిస్థితి ఉంది. దీనికితోడు కొన్ని చోట్ల సామాజికవర్గం ప్రాతిపదికగా ప్రాధాన్యతలు మారిపోతున్నట్టు ఆరోపణలున్నాయి.ఇలా జిల్లాలో కొద్దిమంది అధికారులు కులాల కుమ్ములాటలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అటు విద్యార్థుల భవిష్యత్‌కు ఇటు ఉపాధ్యాయుల మధ్య సమన్వయానికి తూట్లు పొడుస్తున్నట్టు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.