గల్ఫ్ కార్మికులకు పాత వేతనాలనే కొనసాగించాలి.. గల్ఫ్ జేఏసీ డిమాండ్.. కలెక్టర్లకు వినతిపత్రం

నిర్మల్ లో నిరసన తెలుపుతున్న గల్ఫ్ జేసేసీ సభ్యులు

మార్చి 8 నుండి ప్రారంభం అవుతున్న సందర్బంగా గల్ఫ్ జెఏసీ ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లి ఎంపీలను, కేంద్ర విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ ను కలిసి కనీస వేతనాల తగ్గింపు సర్కులర్లను రద్దు చేయాలని కోరుతామని రవిగౌడ్ తెలిపారు. ఈ సర్కులర్ల వలన ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో..

 • Share this:
  గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను (మినిమమ్ రెఫరల్ వేజెస్) ను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లను రద్దు చేసి, పాత వేతనాలను కొనసాగించాలని గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. రెండు నెలల క్రితం ఇదే విషయంపై తాము సమర్పించిన వినతి పత్రంపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తు సమర్పించారు. గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో నిర్మల్ లో స్వదేశ్ పరికిపండ్ల, కరీంనగర్ లో మైదం శ్రీనివాస్, సిరిసిల్లలో తోట ధర్మేందర్, జనగామ శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం అయిదు నెలల క్రితం సెప్టెంబర్ 2020 లో రెండు సర్కులర్లు జారీ చేసింది.

  ఖతార్, బహ్రెయిన్, ఓమాన్, యుఎఇ దేశాలకు వెళ్లే కార్మికుల నెలసరి  వేతనాలను 200 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 15 వేలు), కువైట్ (245 డాలర్లు), సౌదీ అరేబియా (324 డాలర్లు) కు తగ్గిస్తూ భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ సర్కులర్ల ప్రకారం అన్ని క్యాటగిరీలను ఒకేగాటన కట్టి కార్మికులకు, వృత్తి నిపుణులకు కనీస వేతనం ఒకే విధంగా నిర్ణయించడం వలన తీవ్ర అన్యాయం జరుగుతోందని రవిగౌడ్ అన్నారు. ఈ-మైగ్రేట్ వెబ్ సైటులో అలవెన్సులు గురించి 'నాట్ అవేలబుల్' (సమాచారం అందుబాటులో లేదు) అని పెట్టారు.

  సిరిసిల్లలో కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన గల్ఫ్ జేఏసీ సభ్యులు

  ఇది కూడా చదవండి: పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి.. మూడేళ్లకే ఘోరం.. పదో అంతస్థు పైనుంచి దూకి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

  జీతాలు అమలయ్యే తేదీని 26.06.2015 అని ఐదేళ్ల నాటి పాత డేటు వేశారు. ఈ చర్య వెట్టిచాకిరి, బానిసత్వానికి దారి తీస్తుందని రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు రెండవ విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుండి ప్రారంభం అవుతున్న సందర్బంగా గల్ఫ్ జెఏసీ ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లి ఎంపీలను, కేంద్ర విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ ను కలిసి కనీస వేతనాల తగ్గింపు సర్కులర్లను రద్దు చేయాలని కోరుతామని రవిగౌడ్ తెలిపారు. ఈ సర్కులర్ల వలన ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 90 లక్షల మంది భారతీయ కార్మికుల ఆదాయంపై ప్రభావం పడుతుందని, సమస్య తీవ్రతను వివరిస్తామని ఆయన అన్నారు.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో చార్టెడ్ అకౌంటెంట్.. రూ.3000 కోసం ట్రై చేస్తే.. ఏకంగా రూ.6,00,000 పోగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..
  Published by:Hasaan Kandula
  First published: