గల్ఫ్ లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా.. రూ.500 కోట్లతో వెల్ఫేర్ బోర్డు.. గల్ప్ జేఏసీ డిమాండ్లివి..

కలెక్టర్ కు వినతి పత్రం అందించిన గల్ఫ్ జేఏసీ సభ్యులు

ఉపాధి కోసం వలస వెళ్లి గల్ఫ్ దేశాల్లో మృత్యువాత పడుతున్న తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని గల్ఫ్ వర్కర్స్ బోర్డు (గల్ఫ్ జేఏసీ) డిమాండ్ చేస్తోంది.

 • Share this:
  ఉపాధి కోసం వలస వెళ్లి గల్ఫ్ దేశాల్లో మృత్యువాత పడుతున్న తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని గల్ఫ్ వర్కర్స్ బోర్డు (గల్ఫ్ జేఏసీ) డిమాండ్ చేస్తోంది. 500 కోట్ల రూపాయలతో బడ్జెట్లో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కోరుతోంది. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన లేఖను జగిత్యాల జిల్లా కలెక్టర్ కు గల్ప్ జేఏసీ కన్వీనర్ రవీగౌడ్ అందజేశారు. సోమవారం గల్ఫ్ జేఏసీ సభ్యులు జగిత్యాల జిల్లా కలెక్టర్ ను కలిసి తమ వినతిపత్రాన్ని ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి తమ డిమాండ్లను తీసుకెళ్లాలని కోరారు. అనంతరం రవీ గౌడ్ మాట్లాడుతూ గల్ఫ్ తో సహా 18 దేశాలలో పనిచేసే ప్రవాసి కార్మికులకు ఉపయోగపడే చట్టబద్ధమైనతెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

  గల్ఫ్ తో సహా 18 దేశాలలో పనిచేసే ప్రవాసి కార్మికులకు ఉపయోగపడే చట్టబద్ధమైన తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. బహరేన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓనూన్, యుఎఇ, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, నార్త్ సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్, మలేసియా లాంటి దేశాలలో పని చేసే కార్మికులకు సాంఘిక భద్రత, ఆయా దేశాల నుండి వాపస్ వచ్చిన కార్మికుల పునరావాసం కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని అన్నారు. ప్రతి వలస కార్మికుడిని బోర్డులో చేర్చుకొని పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు.

  Gulf JAC demands that Rs 5 Lakh ex gratia for families who lost their member in Gulf Countries full details here గల్ఫ్ లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా.. రూ.500 కోట్లతో వెల్ఫేర్ బోర్డు.. గల్ప్ జేఏసీ డిమాండ్లివి..
  గల్ఫ్ జేఏసీ డిమాండ్లివి

  ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

  గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్మెంట్ ఫీజులు తదితర ఖర్చులకోసం పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలన్నారు. జైళ్లలో మగుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) ఇవ్వాలని, తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ గృహనిర్మాణం వంటి పథకాల వర్తింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ,గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిళ్ల రవి గౌడ్, సుందరగిరి రాజశేఖర్, బుర్ర. రంజిత్, కోటగిరి నరేష్ తో పాటు పి.శంకర్,పోల కిషన్, మాదా గంగా రెడ్డి పాల్గొన్నారు.
  ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
  Published by:Hasaan Kandula
  First published: