వలస కార్మికుల కోసం మద్ధతు కూడగడుతున్న గల్ఫ్ జేఏసీ.. ఛలో ఢిల్లీ కార్యక్రమం దిశగా అడుగులు

INTUC రాష్ట్ర నాయకుడు ఆర్.డి. చంద్రశేఖర్ ను కలిసిన గల్ఫ్ జెఏసి బృందం

కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం అయిదు నెలల క్రితం సెప్టెంబర్ 2020 లో రెండు సర్కులర్లు జారీ చేసింది.

 • Share this:
  సొంత ఊళ్లో ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికులు కష్టాల్లో కూరుకుంటున్నారు. అక్కడ ఏజెంట్ల చేతుల్లో మోసపోయి చిత్రహింసలు అనుభవిస్తున్నారు. కుటుంబ సభ్యుల కోసం, వారి క్షేమం కోసం గల్ఫ్ దేశాల్లో ఎన్ని కష్టాలను అనుభవించేందుకైనా సిద్ధంగా ఉన్న కార్మికులకు ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఇబ్బందికరంగా మారాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల వేతనాల విషయంలో భారత ప్రభుత్వం ఇటీవల చేసిన మార్పులతో వలస జీవులను ఆర్థికంగా దెబ్బకొడుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులను కలిసేందుకు, అదే సమయంలో తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు గల్ఫ్ జేఏసీ సిద్ధమయింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రం ఇచ్చిన గల్ఫ్ జేఏసీ సభ్యులు, తాజాగా ఢిల్లీ బాట పట్టారు.

  కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం అయిదు నెలల క్రితం సెప్టెంబర్ 2020 లో రెండు సర్కులర్లు జారీ చేసింది. ఖతార్, బహ్రెయిన్, ఓమాన్, యుఎఇ దేశాలకు వెళ్లే కార్మికుల నెలసరి వేతనాలను 200 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 15 వేలు), కువైట్ (245 డాలర్లు), సౌదీ అరేబియా (324 డాలర్లు) కు తగ్గిస్తూ భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ సర్కులర్ల ప్రకారం అన్ని క్యాటగిరీలను ఒకేగాటన కట్టి కార్మికులకు, వృత్తి నిపుణులకు కనీస వేతనం ఒకే విధంగా నిర్ణయించడం వలన తీవ్ర అన్యాయం జరుగుతోందని రవిగౌడ్ అన్నారు. ఈ-మైగ్రేట్ వెబ్ సైటులో అలవెన్సులు గురించి 'నాట్ అవేలబుల్' (సమాచారం అందుబాటులో లేదు) అని పెట్టారు. జీతాలు అమలయ్యే తేదీని 26.06.2015 అని ఐదేళ్ల నాటి పాత డేటు వేశారు.

  GULF JAC demands execute old laws and gathering support form other Unions for Chalo Delhi వలస కార్మికుల కోసం మద్ధతు కూడగడుతున్న గల్ఫ్ జేఏసీ.. ఛలో ఢిల్లీ కార్యక్రమం దిశగా అడుగులు
  గల్ప్ జేఏసీ విడుదల చేసిన బ్రోచర్

  ఇది కూడా చదవండి: ప్రపంచం అంతం కాబోతోంది.. ఈ వీడియోనే సాక్ష్యం.. తేల్చిచెబుతున్న క్రైస్తవ ప్రముఖులు.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

  ఈ జీవో గల్ఫ్ కార్మికులకు శాపంగా మారింది. దీంతో గల్ఫ్ కార్మికుల కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చేందుకు గల్ఫ్ జేఏసీ ముందుకొచ్చింది. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు కొత్తగా వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలను (మినిమమ్ రెఫరల్ వేజెస్) తగ్గిస్తూ భారత ప్రభత్వం సెప్టెంబర్ 2020 లో జారీచేసిన రెండు సర్కులర్లను ఉపసంహరించుకోవాలని గల్ఫ్ జేఏసీ డిమాండ్ చేస్తోంది. పాత వేతనాలను కొనసాగించాలనే డిమాండ్ తో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతు కోరుతూ పలు సంఘాల నేతలను కలిసేందుకు గల్ఫ్ జెఏసి బృందం ఫిబ్రవరి 24న బుధవారం హైదరాబాద్ లో పర్యటించింది. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) రాష్ట్ర నాయకుడు ఆర్.డి. చంద్రశేఖర్ ను గల్ఫ్ జెఏసి నాయకులు గుగ్గిల్ల రవిగౌడ్, తోట ధర్మేంద్ర కలిసి గల్ఫ్ కార్మికుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
  ఇది కూడా చదవండి: గుంటూరులో డిగ్రీ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు.. చాటింగ్ లో ఆ మెసేజ్ ల వల్లే దారుణం..!
  Published by:Hasaan Kandula
  First published: