ఇద్దరు చదువుకుని గెస్ట్ లెక్చరర్స్‌గా ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నారు. ( Guest lecturer Suicide ) అయితే ఆ ఇద్దరు తమ బాధ్యతలు మరచి పోయారు. ఫలితంగా మహిళ లెక్చరర్ మరో వివాహితుడైన లెక్ఛరర్‌తో లైంగిక సంబంధం ఏర్పరచుకుంది. తీరా తనకు అనుకూలంగా ఆ ప్రియుడు వ్యవహరించకపోవడంతో బెదిరింపులతో పాటు వేదింపులకు పాల్పడింది. దీంతో ఆమె వేధింపులకు తట్టుకోలేని లెక్చరర్ ఉరివేసుకుని ప్రాణాలు వదిలాడు.
వివరాల్లోకి వెళితే..మెదక్ పట్టణంలోని జాంబికుంటలో వెంకటేశం తన భార్య పిల్లలతో కలిసి నివాసం
ఉంటున్నారు. ప్రస్తుతం వృత్తి రీత్యా వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.కాగా ఇదే కాలేజీ లో గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న మమతతో పరిచయం ఏర్పడింది. ( Guest lecturer Suicide )ఇది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో పథకం ప్రకారమే మమత ఇద్దరు ఏకంతంగా కలిసి ఉన్నప్పుడు ఫోటోలు తీసుకుంది. అక్రమ సంబంధాన్ని అడ్డుపెట్టుకున్న మమత ప్రియుడు వెంకటేశ్‌ను డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. ఇలా తరచుగా డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో ఇస్తూ.. పోయిన..వెంకటేశ్‌ను ఇటివల లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేసింది... దీంతో ఖంగుతిన్న వెంకటేశ్ అంత డబ్బు ఇవ్వలేనని చెప్పాడు. ( Guest lecturer Suicide )దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. ఒకవేళ అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో ఇద్దరి ఫోటోలను పబ్లిక్‌లో పెడతానని మమత బెదిరించింది. ఆ తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.
దీంతో ఆమె బెదిరింపులకు బయపడి పోయిన వెంకటేశ్..మానసికంగా ఆందోళనల చెందాడు. దీంతో ఇద్దరి విషయం బయటపడడం ద్వారా ఉద్యోగం కోల్పోవడంతో పాటు కుటుంబం వద్ద పరువు పోతుందని భావించాడు. ( Guest lecturer Suicide )దీంతో మంగళవారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కొల్పోయాడు. కాగా మమత భారిన పడి గతంలోనే మరో ఇద్దరు కూడా ఇలా మోసపోయినట్టు స్థానికుల సమాచారం.
కాగా మృతి చెందిన వెంకటేశ్‌కు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. ఆయన మృతికి మమత
కారణమంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఈ ఆత్మహత్య గ్రామంలో సంచలనంగా మారింది. ( Guest lecturer Suicide )లెక్చరర్లుగా ఉండి అక్రమ సంబంధాలు నెరవేర్చడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చి దిద్దాల్సిన వృత్తిలో ఉండి.. వారే ఇలాంటి చర్యలకు పాల్పడడం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ( Guest lecturer Suicide ) భవిష్యత్‌లో ఇలాంటీ సంఘటనలు జరగకుండా లెక్చరర్లపై నిఘా ఏర్పాటు చేయాలని ప్రభుత్వా అధికారులను కోరుతున్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.