మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలో వరుడి ఆత్మహత్య.. ఏం జరిగింది?

Groom Suicide : సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక మరేదైనా జరిగిందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సందీప్‌ను ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేశారా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

news18-telugu
Updated: November 10, 2019, 2:13 PM IST
మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలో వరుడి ఆత్మహత్య.. ఏం జరిగింది?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: November 10, 2019, 2:13 PM IST
హైదరాబాద్‌లోని కొంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మరికొద్దిసేపట్లో పెళ్లి జరగనుండగా.. వరుడు సందీప్ ఫంక్షన్ హాల్‌లోని ఓ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది క్షణాల్లో పెళ్లి జరుగుతుందనగా సందీప్ ఇలా ఆత్మహత్యకు ఒడిగట్టడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక మరేదైనా జరిగిందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సందీప్‌ను ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేశారా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఒకవేళ పెళ్లి ఇష్టం లేకపోయి ఉంటే పెళ్లి మంటపం దాకా వచ్చేవాడు కాదు కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పెళ్లి ఏర్పాట్లు చేసిన సందీప్.. ఇలా ఆత్మహత్యకు పాల్పడటం బంధుమిత్రులను శోకసంద్రంలో ముంచింది. సందీప్ మృతదేహాన్ని ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్టు సమాచారం.


First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...