సీఎం కేసీఆర్ మనవడికి బిత్తిరి సత్తి సవాల్

రోజు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు బిత్తిరి సత్తి. అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు.

news18-telugu
Updated: November 21, 2019, 8:07 PM IST
సీఎం కేసీఆర్ మనవడికి బిత్తిరి సత్తి సవాల్
హిమాన్షు, బిత్తిరి సత్తి
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీల గ్రీన్ ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. సినీ స్టార్లు మొక్కలు నాటుతూ తమ సహచర నటులను హరిత సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే అక్కినేని అఖిల్, కవిత, వరుణ్ తేజ్, సాయిపల్లవి, పీవీ సింధు, యాంకర్ సుమ, బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, సూపర్ స్టార్ కృష్ణ.. తమ వంతుగా మొక్కలు నాటారు. ఇక తాజాగా బిత్తిరి సత్తి గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లో మొక్కలు నాటారు. ఆ  ఫొటోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

రోజు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు బిత్తిరి సత్తి. అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. రాజ్యసభ సభ్యులు సంతోష్  ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు.  ఇక తనలాగే మొక్కలు నాటాల్సిందిగా  హాస్య నటుడు బ్రహ్మానందం,  కేసీఆర్ మనవడు కల్వకుంట్ల హిమాన్షు రావు, కమెడియన్ ప్రియదర్శిని,  బిగ్‌బాస్ ఫేమ్ శివ జ్యోతికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

కాగా, తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ మొదట ప్రారంభించారు. అంతేకాదు మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెప్టెంబరు 5న వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరగనుంది.
First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading