అన్నాదమ్ముళ్ల సవాల్...చైతన్యకు ఛాలెంజ్ విసిరిన అఖిల్

తనవంతుగా మొక్కలు నాటిన అఖిల్...గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు తన సోదరుడు నాగచైతన్య, మెగా హీరో వరుణ్ తేజ్‌ని నామినేట్ చేశారు.

news18-telugu
Updated: August 20, 2019, 7:09 PM IST
అన్నాదమ్ముళ్ల సవాల్...చైతన్యకు ఛాలెంజ్ విసిరిన అఖిల్
నాగచైతన్య, అఖిల్
news18-telugu
Updated: August 20, 2019, 7:09 PM IST
గ్రీన్ ఛాలెంజ్ సందడి మళ్లీ మొదలయింది. గత ఏడాది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు మొక్కలు నాటి తమ మిత్రులకు ఛాలెంజ్ విసిరారు. మొక్కలు నాటడమే గాక.. వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ఇక ఈసారి కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్‌ను అక్కినేని హీరో అఖిల్ స్వీకరించాడు. తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి ఆ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశాడు.
తనవంతుగా మొక్కలు నాటిన అఖిల్...గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు తన సోదరుడు నాగచైతన్య, మెగా హీరో వరుణ్ తేజ్‌ని నామినేట్ చేశారు. ఇద్దరూ తన ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటాలని సూచించాడు. ఇక తన ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటినందుకు అఖిల్‌కు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ సంతోష్.


First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...