GREE SIGNAL TO TEACHER PROMOTION CM SAID IN VANAPARTHY MEETING VRY
CM KCR : ఉపాధ్యాయులకు సీఎం శుభవార్త.. ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్..
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
CM KCR : ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తామన్నారు.
సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులకు శుభవార్త ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను ఇవ్వాలని విద్యాశాఖ మంత్రిని కోరడంతో పాటు సీఎస్‌కు ఆదేశాలు ఇచ్చారు. మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ వేరే రాష్ట్రానికి చెందిన వాళ్లు.. తెలంగాణకు వచ్చి నేర్చుకొని వెళ్లేలా ఉండాలని సూచించారు..30, 35 సంవత్సరాలు పని చేసిన వ్యక్తులకు ఎప్పుడు ప్రమోషన్లు ఏ టైంకు వస్తయ్.. ఎప్పుడు రిటైర్డ్ అవుతారు.. రిటైర్డ్ అయ్యే లోపే బెనిఫిట్స్ అన్నీ రెడీ చేసి పదవీ విరమణ రోజున కార్యాలయంలో సన్మానించి, అధికారిక వాహనంలో దించి రావాలని చెప్పారు.
మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ ఉందని అన్నారు.ఎన్నో రాష్ట్రాలు మనకన్నా ఆర్థికంగా, పారిశ్రామికంగా ముందున్నం అని చెప్పుకున్నటువంటి రాష్ట్రాల కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కంటే పలు రాష్ట్రాల కంటే ఎక్కువ.. ఇదంతా మీ కృషే. ఇవాళ 24 గంటలు అన్ని రంగాలకు ఎక్కడ కూడా నిమిషం కూడా కరెంటు పోకుండా సరఫరా చేసే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గతంలో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో విద్యుత్ అత్యధిక వినియోగం 13600 మెగావాట్లు. ఇవాళ తెలంగాణ 14వేల మెగావాట్లకు వెళ్తుందని అన్నారు.
ఇప్పుడు విద్య, వైద్యంపైనే దృష్టి పెట్టామని చెప్పిన సీఎం రాష్ట్ర అభివృద్ది కోసం
అవస్థలు పడ్డవాళ్లం.. కష్టపడ్డం కాబట్టి ఇవాళ ఇవన్నీ బ్రహ్మాండంగా చేసుకున్నామని అన్నారు. ప్రాథమికంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం. మంచినీళ్ల బాధ పోయింది. కరెంటు బాధ పోయింది.. సాగునీటి సమస్య పోయింది.. పోతున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే పటిష్ట పడుతాం. ఈ రకంగా మినిమమ్ బేసిక్ ఇష్యూస్ చేసుకున్నం. ఇప్పుడు విద్య, వైద్యం మీద దృష్టి పెట్టాం. ఈ క్రమంలోనే మన ఊరు – మన బడి రాష్ట్ర కార్యక్రమమైనా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా వనపర్తి నుంచే ప్రారంభం చేసుకున్నాం. ప్రభుత్వ రంగంలో విద్య కూడా చాలా అద్భుతంగా జరగాలే. దాదాపు 10వేల కోట్ల ఖర్చుతో కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. వైద్య రంగంలో కూడా ముందుకు దూసుకెళ్తున్నాం.
వనపర్తికి వరాలు
సీఎం నిధి నుంచి ప్రత్యేకంగా వనపర్తికి రూ.కోటి ప్రత్యేకంగా వనపర్తి పట్టణానికి సీఎం నిధి నుంచి రూ.కోటి, మిగతా మున్సిపాలిటీలకు రూ.50లక్షలు, అదే విధంగా గ్రామ పంచాయతీలకు అదనంగా రూ.20లక్షలు మంజూరు చేస్తున్నానని సీఎం చెప్పారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.