Warangal crime : వీడెక్కడి మనవడు...5 రోజులుగా తాత శవం ఫ్రిజ్‌లోనే...పెట్టి వాసన రాకుండా...

ఫ్రిజ్‌లో శవం

Warangal crime : సొంత తాత మరణించిన తర్వాత.. ఓ మనవడు కర్కశంగా వ్వవహరించాడు..ఉన్నత చదువులు చదివినా..కనీస విచక్షణ కోల్పోయాడు..అంత్యక్రియలు డబ్బులు లేవని శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఐదురోజుల పాటు సహవాసం చేశాడు..అయితే ఇది తేల్చేందుకు పోలీసులు ఆ మనవన్ని అదుపులోకి తీసుకున్నారు.

  • Share this:
    వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఒక దయనీయమైన సంఘటన నెలకొంది.అయితే సంఘటన దయనీయమే అయినా.. యువకుడు వ్వవహరించిన తీరు పలు అనుమానాలకు తావీస్తుంది..డబ్బులు లేవంటూ తాతాకు వచ్చే పెన్షన్‌ డబ్బులు కేవలం 40వేల కోసం కర్కశంగా వ్యవహరించాడు..శవంతో ఇంట్లోనే ఐదురోజుల పాటు ఉన్నాడు. దీంతో ఈ సంఘటన పరకాలలో పట్టణంలో సంచలనంగా మారింది...ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి...

    కామారెడ్డికి చెందిన బైరం బాలయ్య (90)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో బాలయ్య ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.పదవి విరమణ అనంతరం వాస్తు చెబుతూ కుటుంబాన్ని పోషించేవాడు..ఇక బాలయ్యకు ముగ్గురు కొడుకులు ఉండగా కుటుంబ వివాదాల్లో ఎవరికి వారు ఉంటున్నారు.. అందులో ఇద్దరు కామారెడ్డిలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోగా.. హరికృష్ణా అనే కుమారుడు వరంగల్ జిల్లా పరకాల పట్టణంలో ఉండేవారు..కాగా హరికృష్ణకు కుమారుడు నిఖిల్ ఉన్నాడు.

    అయితే కామారెడ్డిలో ఉన్న బాలయ్య దంపతులు పరకాలలో ఉంటున్న కుమారుడు హరికృష్ణ వద్దకు చేరారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు కుమారుడు హరికృష్ణతో బాలయ్య భార్య నర్సమ్మ కూడా గత కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందారు. ఇక అప్పటి నుండి హరికృష్ణ కుమారుడు నిఖిల్ తో కలిసి బాలయ్య పరకాలలోనే నివాసం ఉంటున్నాడు.. కాగా ఇటివల బాలయ్యకు పక్షవాతం సోకడంతో ఆయనకు సేవలు చేయడంతో పాటు తనకు ఎవరు లేరనే మానసిక వేదనతో నిఖిల్ జీవనం కొనసాగిస్తున్నాడు..

    తాతాకు వచ్చే 40 వేల రూపాయల పెన్షన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్నాడు.. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా బాలయ్య గత ఆదివారం చనిపోయాడు..అయితే అప్పటికే కొంత ఆర్ధిక ఇబ్బందులు ఉండడంతోపాటు తనకు బంధువులు, రక్తసంబంధీకులు కూడా లేకపోవడంతో మనవడు నిఖిల్ మానసిక ఆందోళనకు గురయ్యాడు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో అంత్యక్రియల కోసం ఆలోచించాడు. అయితే డబ్బులు ఎవరిని అడిగే పరిస్థితి లేక ..మరోవైపు తన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేక సతమతయ్యాడు. దీంతో తాతా పెన్షన్‌ డబ్బులు వచ్చేదాకా శవాన్ని ఫ్రీజ్‌ దాచి పెట్టాడు.. వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లి ఇంట్లోనే ఉన్నాడు. చనిపోయిన విషయాన్ని ఎవరికి చెప్పకుండా మెయింటెన్ చేశాడు.

    అయితే అయిదు రోజులుగా శవం ఫ్రిజ్‌‌లో పెట్టడడంతో దుర్వాసన మొదలైంది..కాంప్లెక్స్ మొత్తం దుర్వాసన వెదజల్లింది..ఈ క్రమంలోనే కాంప్లెక్స్ యజమాని నిఖిల్‌ను ప్రశ్నించడంతో ఎలుక చచ్చిపోయిందని కవర్ చేశాడు. కాని వాసన విపరీతంగా రావడంతో కాంప్లెక్స్ యజమాని నేరుగా వెళ్లి ఇంట్లో ఉన్న ఫ్రీజ్‌ను తెరిచి చూడడడంతో శవం బయటపడింది..దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని బాలయ్య శవాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. అనంతరం మృతిపై అనుమానాలు ఉండడంతో నిఖిల్‌ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాని నిఖిల్ మాత్రం డబ్బుల లేకపోవడంతోనే శవాన్ని దాచిపెట్టానని చెబుతున్నాడు..
    Published by:yveerash yveerash
    First published: