Eetala Rajender : ఈటల రాజేందర్‌కు మంగళహరతులతో ఘనస్వాగతం..గజ్వేల్‌లో కూడా...

ఈటల రాజేందర్

Eetala Rajender : హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌కు ఘనస్వాగతం లభించింది..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత బిజెపిలో చేరిన ఈటల రాజేందర్ నేడు నియోజవర్గంలో మొదటిసారిగా పర్యటించారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో కలిసి ర్యాలీలో నిర్వహించారు.

  • Share this:
భాజపాలో చేరిన ఈటల తొలిసారిగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రోడ్‌ షో చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు, పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శామీర్‌పేటలోని తన నివాసం నుంచి భాజపా నేత వివేక్‌తో కలిసి జమ్మికుంట మండలంలోని నగరం గ్రామానికి బయల్దేరిన ఈటలకు అడుగడుగునా నీరాజనం పలికారు. హుజూరాబాద్‌ మండలం కాట్రపల్లి వద్ద స్థానిక భాజపా నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. భాజపా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. గ్రామానికి చెందిన పలువురు తెరాస కార్యకర్తలు వారి సమక్షంలో భాజపాలో చేరారు
.

అనంతరం ఆయన టూవీలర్‌పై ర్యాలీ నిర్వహించారు. స్థానికంగా ప్రజలతో మమేకం అవుతూ రోడ్‌ షో నిర్వహించారు. నియోజకవర్గంలోని కాట్రపల్లి ,నర్సింగాపూర్ ,హుజురాబాద్ ,రాంపూర్ ,చెల్పూర్ ,శాలపల్లి ,జమ్మికుంట ,కొత్తపల్లి ,ధర్మారం ,శాయంపేట ,నాగులపేట ,గండ్రపల్లి ,సణుగుల గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.దీంతో స్థానిక నేతల్లో హుషారు పుట్టింది.

ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన ఈటల ప్రభుత్వం తన అనుచరులను వేధిస్తోందని ఆరోపించారు. ప్రజలు ప్రేమతో మాట్లాడితే..లోంగుతారు తప్ప వేధింపులకు లొంగిపోరని హెచ్చరించారు. ఇక రానున్న ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ‌కు ఘోరి కట్టడడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ ఉప ఎన్నికలు 2023లో వచ్చే సాధారణ ఎన్నికలు ఒక రిహార్సల్స్‌గా ఉంటాయని అన్నారు. ఇక తన ఆత్మగౌరవ పోరాటానికి హుజురాబాద్ వేదిక కానుందని అన్నారు. మరోవైపు రేపటి నుండి ప్రతి ఇంటికి వెళతానని చెప్పారు. నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండి పలు గ్రామాల్లో పర్యటించనున్నారు.

కాగా అంతకు ముందు శామీర్ పేట్ ఇండి నుండి బయలు దేరిన ఈటలకు దారిపోడవును బాజపా శ్రేణులు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలనే గజ్వెల్ నియోజకవర్గంలోని ప్రజ్ఝాపూర్‌లో కూడా ఆయన కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈసంధర్భంగా మాట్లాడిన ఈటల గజ్వేల్ ‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని..అక్కడే తాను టీఆర్ఎస్‌లో చేరానని చెప్పారు. అక్కడి నుండి నేరుగా నియోజకవర్గానికి చేరుకున్నారు.

మొత్తం మీద ఇన్నాళ్లు సైలంట్ గా ఉన్న ఈటల రాజేందర్ బిజేని తీర్థం పుచ్చుకున్న తర్వాత తన ప్రాబల్యాన్ని చూపించుకునే పనిలో పడ్డారు. టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత చాలామంది ఆయన అనుచరులు టీఆర్ఎస్‌లో కొనసాగుతామంటూ ప్రకటనలు చేసినా..బిజెపి జెండా కప్పుకున్న తర్వాత కార్యకర్తల్లో మనోధైర్యం పెరిగింది..దీంతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ...చివరకు నియోజకవర్గంలో సమావేశానికి వెళుతున్న నేతల ముందుకూడా జై ఈటల అనే నినాదాలు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ కూడా అలర్ట్ అయింది. అభివృద్దితో పాటు నేతలను నయానా,భయానా లోంగదీసుకుంటుంది.
Published by:yveerash yveerash
First published: