Nalgonda : ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సజీవ దహనం..అనుమానస్పద మృతిగా కేసు నమోదు

ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సజీవ దహనం..అనుమానస్పద మృతిగా కేసు నమోదు

నల్గొండ జిల్లా మాల్‌ సమీపంలోని తంగడిపల్లి గ్రామానికి చెందిన చల్లం బాలకృష్ణ, సరస్వతి దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు.. బాలకృష్ణ నల్గొండ జిల్లాలోని బ్రాహ్మణవెళ్లి గ్రామం.. సరస్వతి ఎల్బీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నారు..కాగా ఇద్దరు కలిసి నగరంలోని వనస్థలిపురం పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో తమ స్వంత ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు.. Nalgonda : అయితే బాలకృష్ణ మొదటి భార్య ప్రమాదంలో చనిపోవడంతో రెండవ భార్యగా సరస్వతిని పదిహేను సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆయనకు ఓ కొడుకు ఉన్నాడు. కాగా బాలక్రిష్ణ, సరస్వతి దంపతులకు అక్షిత అనే కుమార్తే జన్మించింది. ఇప్పటివరకు బాగానే ఉన్నా...భార్య భర్తల మధ్య ఇటివల మనస్పర్థలు వచ్చాయి..దీంతో ఇరువురు గత కొద్ది రోజులుగా ఘర్షణలు పెట్టుకుంటున్నారు..ఇలా సోమవారం కూడ ఇద్దరి భార్యభర్తల మధ్య వాగ్వావాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.. ఇక నేడు ఇద్దరు పిల్లలతో పాటు బాలక్రిష్ణ ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఈ సమయంలోనే నేడు ఉదయం ఉన్నంటుండి బెడ్రూంలో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగిసి పడ్డాయి..దీంతో ఉపాధ్యాయురాలు సరస్వతి మంటల్లో ఆహుతి అవుతూ కనిపించింది. బాలక్రిష్ణ వెంటనే వెళ్లి కాపాడే ప్రయత్నం చేశాడు. కాని భార్యను కాపాడలేకపోయాడు..కాగా భార్య కాపాడే ప్రయత్నంలో బాలక్రిష్ణ చేతులకు ముఖానికి కాలిన గాయాలయ్యాయి. ఇక ఇంట్లో నుండి పెద్దఎత్తున మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండవ అంతస్తులో చెలరేగుతున్న మంటలను ఆర్పి వేశారు..అనంతరం సరస్వతి సజీవ దహనమైనట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయినట్టు చెప్పారు. అయితే ఇంట్లో ఎలాంటీ ప్రమాదం జరిగిన దఖాలాలు లేకపోవడంతో అనుమానస్పద మృతి క్రింద కేసును నమోదు చేసినట్టు ఏసిపీ పురుషోత్తం తెలిపారు.

  • Share this:
నల్గొండ జిల్లా మాల్‌ సమీపంలోని తంగడిపల్లి గ్రామానికి చెందిన చల్లం బాలకృష్ణ, సరస్వతి దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు.. బాలకృష్ణ నల్గొండ జిల్లాలోని బ్రాహ్మణవెళ్లి గ్రామం.. సరస్వతి ఎల్బీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నారు..కాగా ఇద్దరు కలిసి నగరంలోని వనస్థలిపురం పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో తమ స్వంత ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు..

అయితే బాలకృష్ణ మొదటి భార్య ప్రమాదంలో చనిపోవడంతో రెండవ భార్యగా సరస్వతిని పదిహేను సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆయనకు ఓ కొడుకు ఉన్నాడు. కాగా బాలక్రిష్ణ, సరస్వతి దంపతులకు అక్షిత అనే కుమార్తే జన్మించింది. ఇప్పటివరకు బాగానే ఉన్నా...భార్య భర్తల మధ్య ఇటివల మనస్పర్థలు వచ్చాయి..దీంతో ఇరువురు గత కొద్ది రోజులుగా ఘర్షణలు పెట్టుకుంటున్నారు..ఇలా సోమవారం కూడ ఇద్దరి భార్యభర్తల మధ్య వాగ్వావాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు..

ఇక నేడు ఇద్దరు పిల్లలతో పాటు బాలక్రిష్ణ ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఈ సమయంలోనే నేడు ఉదయం ఉన్నంటుండి బెడ్రూంలో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగిసి పడ్డాయి..దీంతో ఉపాధ్యాయురాలు సరస్వతి మంటల్లో ఆహుతి అవుతూ కనిపించింది. బాలక్రిష్ణ వెంటనే వెళ్లి కాపాడే ప్రయత్నం చేశాడు. కాని భార్యను కాపాడలేకపోయాడు..కాగా భార్య కాపాడే ప్రయత్నంలో బాలక్రిష్ణ చేతులకు ముఖానికి కాలిన గాయాలయ్యాయి.

ఇక ఇంట్లో నుండి పెద్దఎత్తున మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండవ అంతస్తులో చెలరేగుతున్న మంటలను ఆర్పి వేశారు..అనంతరం సరస్వతి సజీవ దహనమైనట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయినట్టు చెప్పారు. అయితే ఇంట్లో ఎలాంటీ ప్రమాదం జరిగిన దఖాలాలు లేకపోవడంతో అనుమానస్పద మృతి క్రింద కేసును నమోదు చేసినట్టు ఏసిపీ పురుషోత్తం తెలిపారు.
Published by:yveerash yveerash
First published: