హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar : గంజాయి స్మగ్లింగ్‌లో ప్రభుత్వ టీచర్.. పక్క రాష్ట్రం పోలీసుల అరెస్ట్...

Karimnagar : గంజాయి స్మగ్లింగ్‌లో ప్రభుత్వ టీచర్.. పక్క రాష్ట్రం పోలీసుల అరెస్ట్...

గంజాయి కేసులో పట్టుబడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

గంజాయి కేసులో పట్టుబడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

Karimnagar : సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడడం చర్చనీయాంశమైంది . గంజాయి తరలిస్తూ.. పట్టుబడ్డ ఇద్దరు నిందితుల్లో మంథనికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు మాచిడి శ్రీనివాస్ గౌడ్ ఉండటం స్థానికంగా కలకలం రేపింది.

ఇంకా చదవండి ...

  ( కరీంనగర్ జిల్లా, న్యూస్ 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్.)

  తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర పోలీసులు ఓవైపు గంజాయి సాగుతో పాటు వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు గంజాయి సరఫరాను ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే పోలీసులు, ఉపాధ్యాయులు సైతం ఈ స్మగ్లింగ్ దందాలో కొనసాగుతున్నారు. నేరుగా ఉద్యోగాలకు సెలవులు పెట్టి పవిత్రమైన వృత్తిలో ఉన్న ఓ ప్రభుత్వ టీచర్ గంజాయి స్మగ్లింగ్‌లో పట్టుపడడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మంథని పట్టణంలోని మసీదువాడలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ గౌడ్ అనే ఉపాధ్యాయుడు బెస్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా ఏడేళ్లుగా పని చేస్తున్నాడు . కాగా శ్రీనివాస్ గౌడ్ ఇటివల మహారాష్ట్ర పోలీసుల తనిఖీల్లో గంజాయి స్మంగ్లింగ్ చేస్తు చిక్కాడు. ఆయనతో పాటు మరోకరు కూడా అరెస్ట్ అయ్యారు.

  విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం 

  కాగా పట్టుబడ్డ శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం స్థిరాస్తి సెటిల్మెంట్లు చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు . ఇందుకోసం అనుమతి లేకుండానే విధులకు గైర్హాజరు కావడంతో చట్టవ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డాడు.. ఈ క్రమంలోనే ఈ నెల 11 వరకు పాఠశాలకు హాజరైనట్లు మంథని ఎంఈవో లక్ష్మి తెలిపారు . 12 న రెండో శనివారం , 13 న ఆదివారం కాగా 14 వ తేదీ నుంచి 17 వరకు సెలవు పెట్టారు . 18 న హోలీ సెలవు కా 19 న ముందస్తు సమాచారం లేకుండానే గైర్హాజరయినట్టు వివరించారు.. ఇక ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు వారం రోజుల పాటు విధులకు హాజరు కాకపోయినా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం విద్యాశాఖలో పరిస్థితికి అద్దం పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

  Yadadri : సాయంత్రం నుండే యాదాద్రికి భక్తులు.. ప్రధాన ఆలయం ప్రారంభోత్సవం..

  రాజకీయ అండతోనే గంజాయి తరలింపు...

  ఉపాధ్యాయుడిగా ఉంటూ గంజాయి స్మగ్లింగ్ చేయడం వెనక రాజకీయ పలుకుబడే కారణమని తెలుస్తోంది శ్రీనివాస్ గౌడ్ మామ ( భార్య తండ్రి ప్రస్తుతం ఓ పార్టీ మంథని మండల అధ్యక్షుడిగా ఉన్నారు . అత్త గతంలో ఎంపీపీగా పని చేశారు . ) దీంతో వారి అండతోనే తన చట్టవ్యతిరేక కార్యాకలాపాలు కొనసాగిస్తున్నట్టు చెబుతున్నారు.. దీంతో ఈ కేసులో పోలీసులు సమగ్ర విచారణ జరిపితే దందాలో ఎవరెవరు ఉన్నారనే విషయం తేలనుంది...


  జిల్లాలో పలువురు ఉపాధ్యాయుల సస్పెషన్

  కాగా జిల్లాలో ఇటివల ఉపాధ్యాయులపై చర్యలు కలకలం రేపుతున్నాయి.. ఉపాధ్యాయ వృత్తిని అడ్డం పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారాలు , చిట్ఫండ్స్ ఏజెంట్లుగా .. ఇతర వ్యాపకాల్లో మునిగిపోతున్నారు .

  ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లాలో ఇటీవలే ఓ ప్రధానోపాధ్యాయుడితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెన్షన్ కావడం విద్యాశాఖలో కలకలం సృష్టించింది . ఇందులో ధర్మారం ఉపాధ్యాయుడు మెహ్రాజుద్దీన్ విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపి సస్పెండ్ కాగా పొట్యాల జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం హరిప్రసాద్ , అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు సుజాత విధుల్లో నిర్లక్ష్యం చూపినందుకు వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సస్పెండ్ చేశారు .అయితే ఉపాధ్యాయులపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Ganja case, Karimnagar

  ఉత్తమ కథలు