హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kothagudem : అడవి దున్న దాడిలో గాయపడిన గిరిజనుడికి ప్రభుత్వ వైద్యుల అరుదైన చికిత్స.. !

Kothagudem : అడవి దున్న దాడిలో గాయపడిన గిరిజనుడికి ప్రభుత్వ వైద్యుల అరుదైన చికిత్స.. !

Kothagudem : అడవి దున్న దాడిలో గాయపడిన గిరిజనుడికి ప్రభుత్వ వైద్యుల అరుదైన చికిత్స.. !

Kothagudem : అడవి దున్న దాడిలో గాయపడిన గిరిజనుడికి ప్రభుత్వ వైద్యుల అరుదైన చికిత్స.. !

Kothagudem : కొత్త గూడేం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఓ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి అరుదైన చికిత్సలు చేసి ప్రైవేటుకు దీటుగా తమ సత్తాను చాటారు. అంత్యంత విలువైన శస్త్రచికిత్సలు చేసి ఔరా అనిపించారు. బాధితుడికి ఎలాంటీ ఆర్థిక ఇబ్బంది లేకుండా మూకుమ్మడిగా వైద్యులు ముందుకు వచ్చి చికిత్స అందించారు.

ఇంకా చదవండి ...

  జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా

  వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రేగులగూడేనికి చెందిన మొక్కటి సమ్మయ్య అనే వృద్ధుడు పొలానికి వెళ్లాడు. పంట పొలంలో తన పని తాను చేసుకుంటూ తను సాకుతున్న పశువులను మేపుతున్నాడు. ఈ క్రమంలో అతినికి సడెన్‌గా అడవి దున్న తారసపడింది. పంట పొలంలో పడి ఇష్టానికి తినేస్తూ, తొక్కేస్తూ ఉంది. దీంతో ఏంచేయాలో తెలీక కాసేపు అదిలించే ప్రయత్నం చేశాడు. తాను తింటుంటే అడ్డుకున్న ఆ వ్యక్తిపై సహజంగానే ఆ అడవి దున్నకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. వెంటపడి మరీ తరుముతూ, తన కొమ్ములు, తలతో కుమ్మేసింది. తప్పించుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అయినా వదల్లేదు . అతన్ని తీవ్ర స్థాయిలో గాయపరిచింది. దీంతో ముఖం, పక్కటెముకలు, వీవు భాగంలో తీవ్ర స్థాయి గాయాలయ్యాయి. ముఖం భాగంలో అయితే చెప్పలేనంత దెబ్బతిన్నది. తీవ్రంగా రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరిన సమ్మయ్యను తోటి పశువుల కాపర్లు అడవి ప్రాంతం నుంచి బయటికి తరలించారు. ముఖం, ముక్కు, దవడ ఎముకలు పూర్తిగా విరిగిపోయి గుర్తు పట్టలేని విధంగా తయారైన సమ్మయ్యకు ముఖం పైన చర్మం సైతం పీక్కొచ్చింది.

  మొత్తం మీద అడవి దున్న దాడికి గుర్తు పట్టలేని విధంగా వికృత రూపంలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రతను అర్థం చేసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఓ బృందంగా ఏర్పడి శస్త్రచికిత్సకు పూనుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరూ సాహసించని విధంగా ఫేషియల్‌ రీకన్సస్ట్రక్షన్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం సమ్మయ్యకు ముఖాన్ని సాధారణ స్థితికి తెచ్చేలా స్వయంగా ఈఎన్‌టీ శస్త్రచికిత్స నిపుణులైన ఆసుపత్రి సూపరెంటెండెంట్‌ డాక్టర్‌ రవిబాబు ఆధ్వర్యంలోని బృందం నడుంకట్టింది.

   ఇది చదవండి : పందెం కోళ్ల అరెస్ట్.. నాలుగు రోజులుగా పోలీసుల పహారా..


  ఓరోమ్యాక్సిలో ఫేషియల్‌ నిపుణుడైన డాక్టర్‌ నవీన్‌, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, డాక్టర్‌ శిరీష్‌ ఇంకా డాక్టర్‌ హరీష్‌, నగేష్‌, ఆది ల బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సలో భాగమైంది. దాదాపు రెండు గంటల పాటు చేసిన ఈ ఆపరేషన్‌ ద్వారా విరిగిపోయిన నాజల్‌ బోన్స్‌, మాక్సిలరీ బోన్స్‌, ఆర్బిటల్‌ బోన్స్‌తో పాటు రిబ్స్‌లో విరిగిన ఎముకలను సరిచేశారు. ప్రవేటులో చాలా ఖరీదైన ఈ సర్జరీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డాక్టర్‌ రవిబాబు బృందం ఒక పేద గిరిజనుడికి అందించి ప్రభుత్వ ఆసుపత్రుల ప్రతిష్టను పెంచారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు, బాధితుని కుటుంబ సభ్యులు వైద్య బృందాన్ని అభినందించింది. తక్కువ మందికే అందుబాటులో ఉండే ఖరీదైన వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేసి విజయవంతం చేయడమే కాక, జీవితం మొత్తం కురూపిలా బతకాల్సిన దుస్థితి నుంచి బాధితున్ని కాపాడినట్లయింది.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Bhadradri kothagudem, Khammam

  ఉత్తమ కథలు