హోమ్ /వార్తలు /తెలంగాణ /

Governor Tamilisai: నన్ను అవమానించారు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై​ సంచలన వ్యాఖ్యలు

Governor Tamilisai: నన్ను అవమానించారు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై​ సంచలన వ్యాఖ్యలు

గవర్నర్ తమిళిసై (పాత ఫొటో)

గవర్నర్ తమిళిసై (పాత ఫొటో)

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ గవర్నర్‌ (Telangana Governor) గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై సౌందర్ రాజన్ (Governor Tamilisai) ప్రసంగించారు. తొలుత తెలుగులో (Telugu) ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళిసై.. కొద్దిసేపటి తర్వాత ఇంగ్లీష్‌లో ప్రసంగాన్ని కొనసాగించారు. తమిళిసై మాట్లాడుతూ.. రాష్ట్రానికి మంచి చేయాలనేదే తన అభిలాష అని గవర్నర్​ అన్నారు. ప్రభుత్వం (TRS Government) గౌరవం ఇవ్వకపోయినా తాను పనిచేస్తామని చెప్పారు. రాజ్‌భవన్ (Raj Bhawan) ప్రజాభవన్‌గా మారిందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్‌భవన్‌పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. స్త్రీల సమస్యలు తగ్గించేందుకు మహిళా దర్బార్ నిర్వహించామని గుర్తుచేశారు. 75 మంది మెరిట్ విద్యార్థులకు ఆగస్టు 15న బహుమతులు అందించామని తెలిపారు.

మూడేళ్లుగా అవమానం..

గత మూడేళ్లుగా చాలా అవమానాలు ఎదుర్కొన్నానని గవర్నర్ అన్నారు. ఎట్​ హోంకు వస్తానని చెప్పిన సీఎం (CM KCR) రాలేదని ఆమె అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఇలా వివక్ష చూపడం సరైంది కాదని గవర్నర్​ హితవు పలికారు.  ప్రజలను కలవాలని అనుకున్న ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

గతంలో మేడారం (Medaram) జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్‌ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించానని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని ఈ సందర్భంగా గవర్నర్​ వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల కోసం తన పని కొనసాగిస్తుంటానని తమిళిసై చెప్పారు. తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి కదా అని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

Telangana Schools and Colleges: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపు విద్యాసంస్థలకు సెలవు

ఎన్నో యూనివర్సిటీలు, హాస్టళ్లను సందర్శించానని, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నానని గవర్నర్​ అన్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల సమస్యల చూసి చలించిపోయానని ఆమె గుర్తు చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రికి లేఖలు రాశానని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించానని తమిళిసై చెప్పారు.

తెలంగాణలో గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ అంతకంతకూ పెరిగిపోతోంది. కొద్దిరోజుల క్రితం గవర్నర్ తమిళిసై ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రులు కేటీఆర్ సహా పలువురు కౌంటర్ ఇచ్చారు. ఇక ఆ తరువాత రాష్ట్రానికి వచ్చి భద్రాచలం సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు గవర్నర్ తమిళిసై. అయితే అక్కడ కూడా అధికారులు గవర్నర్ విషయంలో ప్రోటోకాల్‌ను సరిగ్గా పాటించలేదనే విమర్శలు వచ్చాయి. మరోవైపు రాష్ట్రంలో పర్యటించే విషయంలో ప్రోటోకాల్ వంటి వ్యవహారాలను పట్టించుకోవద్దని గవర్నర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రోటోకాల్ సహా వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రానికి పిర్యాదు చేస్తూనే.. రాష్ట్రంలో తాను చేయాల్సిన పనులు, పర్యటనలు చేసుకుంటూ వెళ్లాలనే యోచనలో గవర్నర్ తమిళిసై ఉన్నారని చర్చ జరుగుతోంది. .

First published:

Tags: CM KCR, Governor Tamilisai, Raj bhawan, Telangana, Telangana Government

ఉత్తమ కథలు