Governor Tamilisai Soudararajan: గవర్నర్ తమిళిసై లేఖ.. తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు

తమిళిసై, కేసీఆర్(ఫైల్ ఫోటో)

Governor Tamilisai Soudararajan: రాజకీయ పార్టీల నేతలు, ఇతర వ్యక్తులు ఏదైనా అంశాన్ని తన దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిపై ఫోకస్ చేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.

  • Share this:
    Governor Tamilisai Soudararajan Letter: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖల పరంపర కొనసాగుతోంది. తనకు వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వానికి పంపిస్తూ వస్తున్న గవర్నర్.. తాజాగా మరో ఫిర్యాదును తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల భర్తల పెత్తనంపై గవర్నర్‌కు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన తమిళిసై ఈ అంశంపై దృష్టి సారించాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. గవర్నర్ రాసిన లేఖపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అధికారిక కార్యక్రమాల్లో, సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధుల బంధువులు పాల్గొనకుండా చూడాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

    మరోవైపు రాజకీయ పార్టీల నేతలు, ఇతర వ్యక్తులు ఏదైనా అంశాన్ని తన దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిపై ఫోకస్ చేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కొద్దిరోజుల క్రితం కరోనా అంశంపై ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇటీవల తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపింది. తాజాగా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల భర్తల పెత్తనంపై తనకు వచ్చిన ఫిర్యాదుల గురించి ప్రభుత్వానికి గవర్నర్ లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: