తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) లేఖ రాశారు. యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుపై ఈ లేఖలో పేర్కొన్నారు. రాజ్‌భవన్‌కు(Raj Bhavan) వచ్చి బిల్లుపై చర్చించాలని విద్యాశాఖ మంత్రికి సూచించారు. ఇదే అంశంపై యూజీసీకి(UGC) కూడా గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చేయడంపై యూజీసీ అభిప్రాయం కోరారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని మూడేళ్లుగా చెబుతున్నానని అన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రస్తావించారు.
ప్రస్తుతం తెలంగాణలోని ఉభయ సభలు ఆమోదించిన అనేక బిల్లులు గవర్నర్ దగ్గర ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, ములుగులోని అటవీకళాశాల, పరిశోధానా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేసే బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు, ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టెర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్) సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్‌యాన్యూయేషన్) అమెండ్మెంట్ బిల్లు, తెలంగాణ మోటర్ వెహికల్స్ ట్యాక్సేషన్ అమెండ్మెంట్ బిల్లు, తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు ఉన్నాయి. తాజాగా ఇందులోని తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు అంశంపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి రాజ్ భవన్‌కు రావాలని గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో సూచించారు.
మరోవైపు కొద్దిరోజుల క్రితం ఈ బిల్లుల అంశంపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదేనని తెలిపారు. గవర్నర్‌గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని చెప్పారు. రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు.
Munugode Bypoll Result: మునుగోడులో టీఆర్ఎస్ గెలవ లేదు .. గెలిచిన వాళ్ల పేర్లు చెప్పిన బండి సంజయ్
BJP in Munugode : మునుగోడు ఉప ఎన్నికలో ఓడినా బీజేపీకి భారీ లాభం
శాసనసభ ఆమోదించిన 7 బిల్లులు ఇంకా రాజ్‌భవన్ దాటి బయటకు రాలేదంటూ జరుగుతున్న ప్రచారంపై తమిళిసై స్పందించారు. బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో తన పరిధిలో తాను నడుచుకుంటానన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ వెల్లడించారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, గవర్నర్‌గా బాధ్యతాయుతంగా నిర్ణయాలు వెలువరిస్తానని తమిళిసై స్పష్టం చేశారు.
మరోవైపు సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను గవర్నర్ తమిళిసై కలిశారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళిసై.. గవర్నర్‌గా మూడేళ్లు పదవీకాలం పూర్తి చేసుకున్నందుకు మర్యాదపూర్వకంగానే హోంమంత్రిని కలిశానని చెప్పారు. అయితే తెలంగాణలోని పరిణామాలను, మునుగోడు ఉప ఎన్నిక జరిగిన తీరును ఆమె హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.