Home /News /telangana /

GOVERNOR TAMILISAI IS ONCE AGAIN PUTTING THE TELANGANA GOVERNMENT IN TROUBLE BY GOING TO BASARA IIIT TODAY PRV

Basara IIIT: గవర్నర్​ తమిళిసై మరో కీలక నిర్ణయం.. ఇరకాటంలో TRS​ ప్రభుత్వం

గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​ (ఫైల్​)

గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​ (ఫైల్​)

బాసర ట్రిపుల్​ ఐటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విద్యార్థుల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో గవర్నర్​ తమిళిసై కీలక నిర్ణయం తీసుకుని టీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఇటీవల బాసరకు చెందిన విద్యార్థి ప్రతినిధి బృందం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను  (Governor Tamilisai) కలిసింది.  ఆహారం, అడ్మినిస్ట్రేషన్ గురించి సమస్యలను గవర్నర్ దృష్టికి విద్యార్థుల బృందం తీసుకెళ్లింది. ఈ సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ (Food poison) పై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. పుడ్ పాయిజన్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని గవర్నర్ చెప్పారు. తాను మీకు ఎంత సపోర్ట్ చేయగలనో అంత మేరకు సపోర్ట్ చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. తాను త్వరలోనే 75 కాలేజీలను సందర్శిస్తానని గవర్నర్ ప్రకటించారు. బాసర ట్రిపుల్ ఐటీని కూడా సందర్శిస్తానన్నారు.

    ఇరకాటంలో ప్రభుత్వం..

    బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత కొంతకాలంగా తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారం రోజు పాటు ఆందోళనకు దిగగా.. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హామీ మేరకు నిరసనకు ముగింపు పలికారు. మంత్రి హామీ ఇచ్చినప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకుండాపోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



    బాసర ట్రిపుల్​ ఐటీ విషయంలో ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం (Telangana government)పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలైతే ఇచ్చారు కానీ. రోజుకో కొత్త సమస్య బాసర ఐఐఐటీలో వెలుగుచూస్తోంది. దీంతో ఇటు విద్యార్థులు, అటు రాజకీయ పార్టీలు టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై (TRS Government) మండిపడుతున్నారు. దీంతో నేరుగా గవర్నర్​ దగ్గరికే వెళ్లి విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు.  వెంటనే బాసరకు పర్యటన​ షెడ్యూల్​ సెట్​ చేశారు. దీంతో ఇపుడు రాష్ట్ర​ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది.

    గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)  నేడు బాసరలో పర్యటించనున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT)ని సందర్శించి.. విద్యార్థులతో భేటీ కానున్నారు. ఇందుకోసం గవర్నర్ తమిళిసై.. ఈ రోజు రాత్రి బాసర బయలుదేరనున్నారు. రాత్రి రైలులో బాసరకు వెళ్లనున్నారు. రేపు ఉదయం బాసర సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళిసై దర్శించుకోనున్నారు. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ చేరుకుని.. విద్యార్థులతో మాట్లాడనున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు.. క్యాంపస్ పరిసరాలను పరిశీలించనున్నారు.

    వంటగదిలోనే స్నానాలు..

    ఇటీవలె బాసర ట్రిపుల్‌ఐటీలోని కేంద్రీయ భండార్‌ మెస్‌లో తిన్న విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌ బారిన పడ్డారు. దాదాపు 600మంది విద్యార్థులు అనారోగ్యం పాలవగా, 20మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత సీరియస్‌ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఇవేవీ తమకు పట్టవన్నట్లు సదరు మెస్‌ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఫుడ్‌ పాయిజన్‌ జరిగిన కేంద్రీయ భండార్‌ మెస్‌లోనే తాజాగా స్నానాల సీన్‌ బయటకు వచ్చింది.

    వంటగదిలో విద్యార్థుల కోసం వండి, వడ్డించే వంటపాత్రలు ఉన్న గదిలోనే ఇద్దరు సిబ్బంది స్నానాలు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. వేలమంది విద్యార్థుల కోసం వంటలు చేసేచోట స్నానాలు చేయడం ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. వరు సగా ఘటనలు చోటుచేసుకుంటూ, రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నా.. వర్సిటీ అధికారుల తీరు మారడంలేదు. .
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Basara IIIT, CM KCR, Food, Governor Tamilisai, Telangana Government, Trs

    తదుపరి వార్తలు