Home /News /telangana /

GOVERNOR TAMILISAI EXPRESSED DISSATISFACTION WITH THE TELANGANA GOVERNMENT FOR NOT HAVING ANY INFORMATION FOR TWO DAYS ON THE REPORT ASKED ON THE MINOR GIRL RAPE INCIDENT PRV

Governor tamilisai: రెండు రోజులైనా నివేదిక ఇవ్వలేదు.. రాజ్​భవన్​ను గౌరవించకుంటే ఎలా? తెలంగాణ గవర్నర్​ సంచలన వ్యాఖ్యలు

గవర్నర్, సీఎం

గవర్నర్, సీఎం

ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​  (Tamilisai Soundararajan) అన్నారు. గ్యాంగ్ రేప్ ఘటనలో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు పట్టించుకోలేదని గవర్నర్​ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో (Telangana) ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నామని, ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ (Tamilisai Soundararajan) అన్నారు. గ్యాంగ్ రేప్ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు పట్టించుకోలేదని గవర్నర్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఆపే శక్తి ఎవరికీ లేదని తెలంగాణ గవర్నర్  తేల్చి చెప్పారు. శుక్రవారం రాజ్​భవన్​లో (Raj Bhavan) లో మహిళా దర్భార్ (Mahila Darbar)ను  తమిళిసై నిర్వహించారు. మహిళలు తమ సమస్యలను చెప్పుకొనేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి.

    కేసీఆర్ సర్కార్​కు చురకలు..

    తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య పొసగడం లేదు. గవర్నర్ పై మంత్రుల, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్​ మహిళా దర్బార్​ నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ దర్బార్​కు దాదాపు 300 మంది మహిళలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చారు. సుమారు గంటకు పైగా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు చెప్పుకున్న బాధలను గవర్నర్ విన్నారు. సీరియస్ కేసులకు సంబంధించిన సమస్యలను గవర్నర్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై  ప్రసంగించారు. రాజ్యాంగాన్ని గౌరవించాలని పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్​ చురకలంటించారు. రాజ్ భవన్ ఎలాంటి హద్దులు దాటడం లేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. రాజ్ భవన్ ను గౌరవించకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. తాను చేసే పనులకు ఎవరు అడ్డం చెప్పినా నేను పట్టించుకోనన్నారు తమిళిసై . తెలంగాణ మహిళల కోసం నా పని కొనసాగుతూనే ఉంటుందన్నారు. నిరసనకారులను నేను పట్టించుకోనన్నారు.



    వారధిగా ఉంటానని..

    ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటానని గవర్నర్​ ఈ సందర్భంగా అన్నారు. మహిళలు సమాజంలో బాధపడుతున్న సమయంలో వారిని ఆదుకొనేందుకు తాను ముందుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలు ఆనందంగా ఉండాలనేది తన తపన అని గవర్నర్​  వ్యాఖ్యానించారు. తెలంగాణలోని మహిళలకు తాను తోడుగా ఉండాలని భావిస్తున్నట్టుగా ఆమె చెప్పారు. ప్రభుత్వానికి బాధిత మహిళలకు మధ్య తాను వారధిగా ఉంటానని కూడా గవర్నర్ హామీ ఇచ్చారు.

    తెలంగాణ ప్రజల పక్షాన..

    మహిళలు ఇబ్బంది పడితే తాను చూస్తూ ఉండలేనని కూడా గవర్నర్ తెలిపారు. ఇబ్బందులు పడిన వారిని ఆదుకొనేందుకు తాను బలమైన శక్తిగా ఉంటానని అన్నారు. తెలంగాణ మహిళలు, సంతోషంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటానని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రజల పక్షాన తాను పనిచేస్తానని చెప్పారు. విధానం ఏదైనా కావొచ్చు, ప్రతిదీ ప్రజల కోసమేననే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తనను విమర్శించిన వాళ్లను పట్టించుకోనని  ఈసందర్భంగా గవర్నర్​ వ్యాఖ్యానించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Governor Tamilisai, Raj bhawan, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు