హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR లేని వేళ భద్రాద్రికి తమిళిసై -సీఎం, గవర్నర్ Ram Navami 2022 సందేశాలివే -మళ్లీ ప్రోటోకాల్ రగడ?

KCR లేని వేళ భద్రాద్రికి తమిళిసై -సీఎం, గవర్నర్ Ram Navami 2022 సందేశాలివే -మళ్లీ ప్రోటోకాల్ రగడ?

భద్రాద్రికి కేసీఆర్ గత ఎనిమిదేళ్లుగా వెళ్లకపోవడం, ప్రోటోకాల్ ఉల్లంఘన ఆరోపణల తర్వాత గవర్నర్ తొలిసారే భద్రాద్రికి వెళుతుండటంతో ఈసారి పండుగ రాజకీయాలకు వేదిక కానుండటం స్పష్టమైపోయింది..

భద్రాద్రికి కేసీఆర్ గత ఎనిమిదేళ్లుగా వెళ్లకపోవడం, ప్రోటోకాల్ ఉల్లంఘన ఆరోపణల తర్వాత గవర్నర్ తొలిసారే భద్రాద్రికి వెళుతుండటంతో ఈసారి పండుగ రాజకీయాలకు వేదిక కానుండటం స్పష్టమైపోయింది..

భద్రాద్రికి కేసీఆర్ గత ఎనిమిదేళ్లుగా వెళ్లకపోవడం, ప్రోటోకాల్ ఉల్లంఘన ఆరోపణల తర్వాత గవర్నర్ తొలిసారే భద్రాద్రికి వెళుతుండటంతో ఈసారి పండుగ రాజకీయాలకు వేదిక కానుండటం స్పష్టమైపోయింది..

తెలంగాణలో సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై అన్నట్లుగా సాగుతోన్న రాజకీయాలు శ్రీరామనవమిన మరో మలుపు తిరగనున్నాయా? రాములోరి సాక్షిగా గులాబీ బాస్ ను ఎండగట్టేలా గవర్నర్ ద్వారా బీజేపీ హైకమాండ్ వ్యూహం రచించిందా? గవర్నర్ భద్రాచలం పర్యటన ఖరారైనప్పటి నుంచి పొలిటికల్ సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో ఇలాంటి ప్రశ్నలే వెల్లువెత్తుతున్నాయి. దేశంలోనే ప్రతిష్టాత్మక రామాలయంగా పేరుపొందిన భద్రాద్రికి కేసీఆర్ గత ఎనిమిదేళ్లుగా వెళ్లకపోవడం, టీఆర్ఎస్ సర్కారుపై ప్రోటోకాల్ ఉల్లంఘన ఆరోపణలు చేసిన తర్వాత గవర్నర్ తొలిసారే భద్రాద్రికి వెళుతుండటంతో ఈసారి పండుగ రాజకీయాలకు వేదిక కానుండటం స్పష్టమైపోయింది..

ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నాడు శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్దమైంది. నవమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్, ప్రగతి భవన్ శనివారం నాడు వేర్వేరు ప్రకటనలు చేశాయి. రాముని జన్మనక్షత్రమైన పునర్వసు సందర్భంగా శ్రీరామనవమిని దేశవ్యాప్తంగా భక్తితో వైభవంగా జరుపుకుంటారన్న తమిళిసై... తన ఆదర్శగుణగుణాలతో శ్రీరాముుడు అందరికీ ధర్మమూర్తిగా పేరుగాంచారని పేర్కొన్నారు. రామనవమి సందర్భంగా సీతతో రాముని కల్యాణ మహోత్సవాన్ని పవిత్రంగా జరుపుకుంటామని తమిళిసై వివరించారు. ధర్మావతారమైన శ్రీరాముని నుంచి సమగ్ర జీవన విధానం కోసం అందరం ప్రేరణ పొందుదామని ఆకాంక్షించారు. మరోవైపు,

Vastu Tips: పడక గదిలో సుఖ సౌఖ్యానికి ఇవి పాటించాలి.. లేదంటే దాపత్యంపై ప్రభావం..

సీఎం కేసీఆర్ నవమి శుభాకాంక్షల ప్రకటనలో భద్రాచలం ఆలయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. ధర్మో రక్షతి రక్షితః అనే సామాజిక విలువను తుచ తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడైన సీతారామచంద్రుడు భారతీయుల ఇష్ట దైవమని కేసిఆర్ కీర్తించారు. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర భార్యా భర్తలబంధం అజరామరమైనదని, భవిషత్ తరాలకు ఆదర్శనీయమైనదని సీఎం తెలిపారు. భద్రాచల సీతారాముల వారి ఆశీస్సులు సదా రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని శ్రీ సీతారాములను సీఎం కేసీఆర్ ప్రార్ధించారు. కాగా,

Shocking: ఉడుముపై అత్యాచారం.. నిందితుల మొబైల్‌ ఫోన్‌లో షాకింగ్ వీడియో.. ముగ్గురి అరెస్ట్

దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధికెక్కిన భద్రాచలంలో ఎంతో ఘనంగా జరిగే శ్రీరామనమి వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రులే ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఆ తంతును నిర్వహించారు. చివరిసారిగా 2015లో భద్రాచలం రాములోరి పెళ్లికి వచ్చిన సీఎం.. రూ.100 కోట్లతో ఆలయాన్ని అభివృద్ది చేస్తానని మాటిచ్చి, మళ్లీ ఇప్పటిదాకా, గత ఏడేళ్లలో ఏనాడూ నవమికి సీఎం హాజరుకాలేదు. గత ఏడేళ్లుగా మంత్రుల చేతులమీదుగానే వేడుక నడుస్తోంది. కరోనా ఉధృతి తగ్గి, రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో భక్తుల మధ్య జరుగుతోన్న ఈఏడాది కల్యాణానికైనా సీఎం వస్తారని అంతా భావించినా, ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నందున హాజరు కష్టంగా మారింది. అదే సమయంలో..

Telangana Governor: కేంద్రానికి దిమ్మతిరిగే పంచ్!.. KCRపై తమిళిసై విమర్శలు బూమరాంగ్ అయ్యాయా?

సీఎం కేసీఆర్ వరుసగా ఏడేళ్లు భద్రాద్రి నవమి వేడుకకు రాకపోవడాన్ని విపక్ష బీజేపీ తరచూ హైలైట్ చేస్తున్నది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య వాగ్వాదాలు కొనసాగుతోన్న క్రమంలోనే ఈ ఏడాది పండుగకు గవర్నర్ తమిళిసై హాజరుకానున్నారు. ఇటీవలే కేంద్రం పెద్దలను కలిసిన గవర్నర్ తనను కేసీఆర్ సర్కారు అవమానిస్తోందని, ప్రోటోకాల్ పాటించడంలేదని ఫిర్యాదులు చేయడం, ఆ వ్యాఖ్యలను టీఆర్ఎస్ మంత్రులు తీవ్రంగా స్పందించడం తెలిసిందే.

KCR విషయంలో కేంద్రం గేరు మార్చిందా? -PM Modiతో భేటీ తర్వాత గవర్నర్ సంచలన వ్యాఖ్యలకు అర్థమేంటి?

శ్రీరామనవవి సందర్భంగా ఆదివారం భద్రాచలయం ఆలయంలో సీతారాముల కల్యాణం, 11న శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సోమవారం జరిగే పట్టాభిషేకానికి గవర్నర్ తమిళిసై హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరనున్న తమిళిసై కొత్తగూడెం(భద్రాచలం రోడ్ స్టేషన్)లో దిగి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో భద్రాచలం చేరుకోనున్నారు. అయితే భద్రాచలంలో ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్‌కి స్వాగతం లభిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా 11వ తేదీనే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో టీఆర్ఎస్ వరి దీక్ష చేపట్టనుంది. కేసీఆర్ రాష్ట్రంలో లేనివేళ, ఆయన వరుసగా గైర్హాజరువతోన్న భద్రాద్రి ఉత్సవాలకు వెళ్లడం ద్వారా గవర్నర్ ఇస్తోన్న సందేశమంటనేది సామాన్యులు చర్చించుకుంటున్నారు.

First published:

Tags: Bhadrachalam, Bjp, CM KCR, Governor Tamilisai, Ram navami 2022, Trs

ఉత్తమ కథలు