Home /News /telangana /

GOVERNOR TAMILISAI ADILABAD TOUR AMID BIRSA MUNDA JAYANTI HAS CANCELLED DUE TO BAD WEATHER MKS

Adilabad : భారీ ఏర్పాట్లు, చివరి నిమిషంలో గవర్నర్ తమిళిసై ఆదిలాబాద్ పర్యటన రద్దు, కారణమిదే

గవర్నర్ తమిళిసై (పాత ఫొటో)

గవర్నర్ తమిళిసై (పాత ఫొటో)

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన రద్దయింది. జిల్లాలోని కేస్లాపూర్‌లో సోమవారం గిరిజన నాయకుడు బిర్సాముండా 146 జయంతి ఉత్సవాల్లో గవర్నర్ పాల్గొనాల్సిఉండగా చివరి నిమిషంలో పర్యటన రద్దయింది. ఆదిలాబాద్ సహా పలు జిల్లాలో వాతావరణం సరిగా లేకపోవడంతోనే గవర్నర్‌ పర్యటన రద్దయినట్లు అధికారులు తెలిపారు.

ఇంకా చదవండి ...
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన రద్దయింది. జిల్లాలోని కేస్లాపూర్‌లో సోమవారం గిరిజన నాయకుడు బిర్సాముండా 146 జయంతి ఉత్సవాల్లో గవర్నర్ పాల్గొనాల్సి ఉంది. అలాగే నాగోబా ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కానీ చివరి నిమిషంలో గవర్నర్ పర్యటన రద్దయింది. దీనికి సంబంధించి రాజ భవన్ వర్గాలు, ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం నుంచి అందిన సమాచారం మేరకు..

ఆదిలాబాద్ సహా పలు జిల్లాలో వాతావరణం సరిగా లేకపోవడంతోనే గవర్నర్‌ పర్యటన రద్దయినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా మబ్బులు కమ్ముకోవడంతోపాటు చినుకులు పడుతున్నాయి. ఏవియేషన్ నిపుణుల సూచనల మేరకు గవర్నర్ తన పర్యటన రద్దుచేసుకున్నారు. కాగా, గవర్నర్ పర్యటన రద్దు అయినప్పటికీ ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్‎లో సమరయోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు యధావిధిగా జరుగనున్నాయి.



గవర్నర్ పర్యటన నేపథ్యంలో  జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్.పి. రాజేష్ చంద్ర, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అంకిత్, పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు ఆదివారం నాడు కేస్లాపూర్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కొమురం భీం విగ్రహానికి రంగులు వేయాలని, ఆ పరిసరాలను శుభ్రపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. నాగోబా దేవాలయ ప్రాంగణాన్ని పరిశీలించి పూజా కార్యక్రమాల నిర్వహణపై వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉట్నూర్ లోని కొమురం భీం కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ ను సందర్శించారు. గవర్నర్ బస చేసే విశ్రాంతి గదులను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోరారు.
Published by:Madhu Kota
First published:

Tags: Adilabad, Governor Tamilisai

తదుపరి వార్తలు