హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : కొనసాగింపు ఎలా అవుతుంది..? ఆసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ ఆగ్రహం..!

Hyderabad : కొనసాగింపు ఎలా అవుతుంది..? ఆసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ ఆగ్రహం..!

Hyderabad : గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించనుండడంపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశీలించాలని ఆమె నిర్ణయించారు.

  అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరో రాజకీయ మలుపు తిరుగుతుంది. బీజేపీ ,టీఆర్ఎస్ పార్టీల అంతర్గత పోరు రాజ్యంగ వ్యవస్థలకు కూడా చేరింది. దీంతో రాజ్యంగపరమైన అధికారాలు ఉన్న గవర్నర్ ‌కు సైతం రాజకీయ సెగ తాకింది. ఈ క్రమంలో ఈ నెల 7 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే బడ్జెట్ సమావేశాల ముందు సాంప్రదాయకంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కాని ఈ సారి జరగబోయో అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండా నేరుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి.

  దీంతో ఈ అంశంపై గవర్నర్ తమిళి సై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. గవర్నర్ ప్రసంగం లేకుండా సభ నిర్వహించాలనే ప్రభుత్వ తీరును ఆమె పరిశీలించాని నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగం లేకుండా చేస్తే.. సభ్యులు చర్చించే హక్కును కోల్పోయినట్టేనని అన్నారు. సాంకేతికంగా గవర్నర్ ప్రసంగం తప్పని సరి కాకపోవచ్చని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల కొనసాగింపులో భాగంగానే.. బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్న ప్రభుత్వ వైఖరి సరికాదని తప్పుబట్టారు. ప్రభుత్వం 5 నెలల తర్వాత సమావేశాలు నిర్వహిస్తూ.. కొనసాగింపు అనడం అనైతికమని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు గమనించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

  Adilabad : తెలంగాణలో కోళ్ల పందాలు.. రోజుకో స్థావరంలో అక్రమ దందాలు..

  అయితే..తన ప్రసంగం లేకపోయినప్పటికి బడ్జెట్ సమర్పణను స్వాగతిస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం నుండి ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటుంది. గత అసెంబ్లీ సమావేశాలు ఇంకా రద్దు కాలేదని దానికి కొనసాగింపుగానే బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఏది ఏమైనా సాంప్రదాయానికి విరుద్దంగా ప్రస్తుతం జరగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఇరు రాజకీయా పార్టీలీ మధ్య మరింత వైషమ్యాలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి..

  మరోవైపు ఇటివల జరిగిన మేడారం జాతరకు వెళ్ళిన గవర్నర్‌ను ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం అధికారులు,గాని, ప్రజాప్రతినిధులు గాని చెప్పకపోవడంతో పాటు గణతంత్రదినోత్సవం నాడు గవర్నర్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ సైతం వెళ్లక పోవడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

  First published:

  Tags: Governor Tamilisai, Telangana Assembly, Telangana Budget, Telangana Budget 2022

  ఉత్తమ కథలు