Home /News /telangana /

GOVERNMENTS HAVE NOT PAID THE WAGES OF THE MAHABUBNAGAR DAILY WORKERS AFTER TWO MONTHS OF EMPLOYMENT GUARANTEE SCHEME MBNR PRV

Employment Guarantee Scheme: ఆ జిల్లాలో  ఆగమ్యగోచరంగా ఉపాధి హామీ కూలీల పరిస్థితి..  వేతనాలు చెల్లింపులో జాప్యంతో పస్తులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలంతా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలే. అలాంటివారికి నెలల తరబడిగా వేతనాలు చెల్లించక కోవడంతో అల్లాడుతున్నారు

    (Sayyad rafi, News18, Mahbubnagar)

    ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలంతా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలే. అలాంటివారికి నెలల తరబడిగా వేతనాలు చెల్లించక కోవడంతో (Governments have not paid the wages )అల్లాడుతున్నారు. వేసవి కావడంతో ఇతర పనులు కూడా  కరువై కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. ఎండలో పని చేసి చాలామంది అస్వస్థతకు గురయ్యారు. నిత్యవసరాలతోపాటు వైద్యం ఖర్చులకు చేతిలో చిల్లి గవ్వ లేక కూలీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

    ఉమ్మడి మహబూబ్​నగర్​ (Mahabubnagar) జిల్లా వ్యాప్తంగా 1692 పంచాయితీలో 8,32,878 మంది కూలీలు ఉపాధి హామీ పథకం (Employment guarantee scheme) పనులు చేస్తున్నారు. వారం వారం ఇవ్వాల్సిన వేతనాలు.. రెండు మూడు మాసాలుగా ఖాతాలో జమ కాకపోవడంతో కూలీలు ఆందోళనకు దిగుతున్నారు. ఉపాధి హామీ పథకం పనులు వారం వారిగా చెల్లింపులు రాష్ట్ర సర్వర్ రాగాన్ సాఫ్ట్ వేర్ ద్వారా  జరిగేవి. రెండు మాసాలుగా కేంద్ర ప్రభుత్వ ఎన్ ఐ సి సర్వర్ (NIC Server) ద్వారా డబ్బులు చెల్లింపు మొదలైంది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డి ఆర్ డి ఎ (DRDA) సిబ్బంది వారం వారం మాస్టర్లను ఎం ఐ సి సర్వర్ లో అప్లోడ్ చేసి పంపిస్తున్నారు. అయితే రెండు నెలలుగా డబ్బులు (daily wages) రావడం లేదు కూలీలకు.

    సాంకేతిక కారణాలంటూ తప్పించకుంటున్న అధికారులు..

    తమకు కొన్ని నెలలుగా కూలీ డబ్బులు ఖాతాల్లో పడటం లేదంటూ మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లో ఉపాధి కూలీలు ఇటీవల పనుల వద్ద ధర్నాకు దిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై అధికారులను సంప్రదించగా .. ‘‘ఉపాధి హామీ కూలీలకు ప్రతివారం సక్రమంగానే కూలీ డబ్బులు చెల్లింపులు జరుగుతున్నాయి. ఎం ఐ సి సర్వర్ ద్వారా నే వేగంగా మాస్టర్ అప్లోడ్ జరిగి కూలీలకు (daily workers) డబ్బులు ఖాతాలో పడుతున్నాయి. రాష్ట్ర సర్వర్ ర్ తు ల గురించి కేంద్ర ప్రభుత్వం కేంద్ర సర్వర్ లోకి మారే క్రమంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. అందుకే ఆలస్యం అయింది’’ అని అధికారులు తెలిపారు ఎక్కడైనా సాంకేతిక సమస్యలతో (Technical Issues) కూలీ డబ్బుల చెల్లింపులు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

    2 నెలల నుంచి కూలీ డబ్బులు ఇస్తలేరు: నక్క లక్ష్మమ్మ, ఉపాధి హామీ కూలి

    కష్టం చేస్తే గానీ రోజు గడవని పరిస్థితి మాది .ఇది రెండు నెలల నుంచి ఉపాధి హామీ కూలీ డబ్బులు ఇస్తలేరు. ఏమి తిని బతకాలే. పులి పైసలు ఇవ్వమని రోజు మెట్లు సార్ లను అడుగుతున్నాం. ఎవరు మా బాధలు పట్టించుకుంటలేరు.

    కొందాం అంటే ఇంట్లో పైసా లేదు: కుమ్మరి యాదమ్మ, ఉపాధి హామీ కూలి

    నేను ఈ నెల మొదటి వారం నుంచి ఉపాధి పనులకు వస్తున్నా. రెండు వారాలు అవుతుంది. కూలి పైసలు ఇస్తలేరు. మిరపకాయలు కొందాం అంటే ఇంట్లో పైసా లేదు. గంజి తాగి రోజు ఉపాధి పనులకు వస్తున్నా. పైసలు ఇవ్వకుంటే పనికి ఎందుకు పోతున్నావ్ అంటూ ఇంట్లో భర్త పిల్లలు తిడుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Mahbubnagar, Telangana Government, Union government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు