లంచం తీసుకోను... అనే బోర్డు పెట్టుకున్న ఆఫీసర్

Telangana : ఇది వరకు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడేవాళ్లు కాదు. ఆమధ్య తహశీల్దార్ విజయా రెడ్డి హత్య తర్వాత పరిస్థితులు మారుతున్నాయా? లంచం అంటేనే అధికారులు టెన్షన్ పడుతున్నారా?

news18-telugu
Updated: November 19, 2019, 7:58 AM IST
లంచం తీసుకోను... అనే బోర్డు పెట్టుకున్న ఆఫీసర్
లంచం తీసుకోను... అనే బోర్డు పెట్టుకున్న ఆఫీసర్
  • Share this:
Telangana : రంగారెడ్డి జిల్లా... అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ హత్య నేరమే అయినా... చాలా మంది దీన్ని ప్రేరణగా తీసుకొని... తమను లంచం అడిగితే చంపుతామని అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు. అధికారులు కూడా తమపై ఎక్కడ దాడి చేస్తారోననే భయంతో... లంచం అడిగేందుకే భయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయారెడ్డి హత్య... తెలంగాణలో రెవెన్యూ శాఖను కుదిపేసింది. పనుల కోసం వచ్చేవాళ్లు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అనే భయం ఉద్యోగులను పట్టుకుంది. ముందు జాగ్రత్త చర్యగా కొంతమంది అధికారులు తమను తాము రక్షించుకునే పనిలో పడ్డారు. ఈ భయం ఏపీలో కూడా పెరుగుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మార్వో... తనపై దాడి జరగకుండా ముందుగానే తన చాంబర్‌లో తన టేబుల్‌కు ముందు అడ్డంగా ఓ తాడు కట్టించుకున్న విషయం మనకు తెలుసు. తాజాగా మరో ప్రభుత్వ అధికారి "నేను లంచం తీసుకోను" అని పెద్ద అక్షరాలతో తన ఆఫీసులో బోర్డు పెట్టించుకున్నారు. కరీంనగర్ ఎలక్ట్రిసిటీ సర్కిల్ ఆఫీసులో కమర్షియల్ ఏడీఈగా పనిచేస్తున్న పోడేటి అశోక్ తన కార్యాలయంలో ఇలా బోర్డు రాయించి పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. అందరూ నిజాయతీగా పనిచేస్తే అవినీతి రహిత వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ బోర్డు ఫొటో... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయా రెడ్డి హత్య... చివరకు ఇలా అధికారులు బోర్డులు పెట్టుకునే పరిస్థితి వచ్చేలా చేసిందని నెటిజన్లు అంటున్నారు.

 

మలబార్ అందాల స్వీట్ బ్యూటీ హనీ రోజ్ ఫొటోస్...
ఇవి కూడా చదవండి :

రోజూ 9 గంటలు పని? ఉద్యోగులకు షాక్?

ఆర్టీసీ కార్మికులు ఇవాళ సమ్మె విరమించే ఛాన్స్...ఒక్కటవుతున్న రాహుల్, పునర్నవి... ఎక్కడో తెలుసా?

బిన్ లాడెన్ ఏనుగు మృతి... ఎవరు చంపారు?

సియాచిన్‌లో మంచు తుఫాను... ఆరుగురు సైనికులు మృతి
First published: November 19, 2019, 7:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading