KTR : న్యూయార్క్ లాంటీ నగరాలే మునిగిపోతున్నాయి.. అయినా.. రజనీకాంత్ మృతికి మాదే భాద్యత

మంత్రి కేటీఆర్

KTR : గత నాలుగు నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాల్లో మణికొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రజనీకాంత్ మృతికి బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు.. దీంతో ఆయన కుటుంబానికి మరో అయిదు లక్షల రూపాయల పరిహారం అదనంగా అందిస్తామని చెప్పారు.

  • Share this:
    గత నాలుగు నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాల్లో మణికొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రజనీకాంత్ మృతికి బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు.. దీంతో ఆయన కుటుంబానికి మరో అయిదు లక్షల రూపాయల పరిహారం అదనంగా అందిస్తామని చెప్పారు.

    ఇటివల కురిసిన వర్షాలకు హైదరాబాద్ (Hyderabad ) మణికొండకు చెందిన రజనీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మున్సిపల్ అధికారులు తవ్విన గోతిలో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. అయితే ఇదే అంశంపై రాష్ట్ర కౌన్సిల్‌లో కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి ( mlc jeevan reddy )అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీ కాంత్ చనిపోవడానికి కారణం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌తో పాటు పురపాలక శాఖ బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ఆ శాఖ మంత్రిగా తాను బాధ్యత వహిస్తున్నానని చెప్పారు.

     ఇది చదవండి :  కేసీఆర్ బొమ్మతోనే అందరం గెలిచాం.. గెల్లు కూడా అలానే గెలుస్తాడు..


    మరోవైపు జరిగిన ప్రమాదంపై శాఖపరమైన విచారణ జరుగుతుందని ఇందుకు సంబంధించి ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసినట్టు చెప్పారు. ఇక ఇలాంటీ ప్రమాదాలు పునారావృతం కాకుండా చర్యలు చేపడతామని అన్నారు. మరోవైపు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదనేది వాస్తవం కాదని చెప్పారు. వరదలకు న్యూయార్క్ లాంటి నగరాలే (newyork)మునిగిపోతున్నాయని చెప్పారు. అయితే మృతుడి కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేయడంతో ఇప్పటికే అయిదు లక్షల రూపాయలు (five lakhs ) అందించామని మరో అయిదు లక్షలు త్వరలో అందిస్తామని చెప్పారు.

    ఇది చదవండి  : పిల్లలను పక్కరూంలో పడుకోవాలని చెప్పిన తండ్రి.. అర్థరాత్రి పూట దారుణానికి దిగాడు...?


    మొత్తం మీద అకాల వర్షాలకు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రభుత్వం స్పందించడంతో భవిష్యత్‌లో ఇలాంటీ ప్రమాదాలు జరగకుండా చూస్తామని హమి ఇచ్చింది. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం నగరలో విచ్చవిడిగా తవ్వకాలతో పాటు పనుల్లో నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తంటుంది. నగరంలో చేపట్టే ఆయా పనులకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు పనుల్లో సమన్వయం లేకపోవడం కూడా ఇలాంటీ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి.

    ఇది చదవండి : మెట్రో స్టేషన్‌ పై నుండి దూకి ఆత్మహత్య ... ! హైదరాబాద్‌లో ఘటన

    Published by:yveerash yveerash
    First published: