హోమ్ /వార్తలు /తెలంగాణ /

Government Hospitals: స‌ర్కారు ద‌వాఖానా వైపే మొగ్గు.. పాల‌మూరు జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రికార్డు స్థాయిలో ప్ర‌స‌వాలు

Government Hospitals: స‌ర్కారు ద‌వాఖానా వైపే మొగ్గు.. పాల‌మూరు జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రికార్డు స్థాయిలో ప్ర‌స‌వాలు

మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి

మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి

Government Hospitals: ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులంటే స‌రైన వైద్యం అంద‌దు.. డాక్ట‌ర్లు ప‌ట్టించుకోరు అనే అపోహా చాలా మందికి ఉంటుంది. అటువంటి అపోహ పోగొట్టి నాణ్య‌మైన వైద్యం అందించ‌డానికి వైద్యులు ఎంతో కృషి చేస్తున్నారు. పాల‌మూరు జిల్లాలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప్ర‌స‌వాలు జ‌రిగాయి. నాణ్య‌మైన వైద్యం అందిస్తే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కే వ‌స్తార‌ని ప్ర‌జ‌లు రుజువు చేశారు.

ఇంకా చదవండి ...

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులంటే స‌రైన వైద్యం అంద‌దు.. డాక్ట‌ర్లు ప‌ట్టించుకోరు అనే అపోహా చాలా మందికి ఉంటుంది. అటువంటి అపోహ పోగొట్టి నాణ్య‌మైన వైద్యం అందించ‌డానికి వైద్యులు ఎంతో కృషి చేస్తున్నారు. ప్ర‌స‌వాల విష‌యంలో మ‌హిళ‌లు (Women) ఎక్కువ‌గా ఇబ్బంది ప‌డుతుంటారు. చాలా మంది మెరుగైన వైద్య కోసం ప్రైవేటు ఆస్ప‌త్రుల‌వైపు చూస్తుంటారు. ఇందుకు భిన్నంగా పాల‌మూరు జిల్లాలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప్ర‌స‌వాల సంఖ్య గ‌ణ‌నీయంగా పెర‌గింది. ఇందులో వైద్యుల కృషి, అధికారుల అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలే కార‌ణం. పాలమూరు జిల్లాలో మొత్తం 17 పీహెచ్‌సీలు ఉన్నాయి. బాదేపల్లి కోయిలకొండ, మహబూబ్‌న‌గ‌ర్‌లో జర్నల్ ఆస్పత్రిలు ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 8103 ప్రసవాలు చేశారు. అందులో అందులో జనరల్ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో 6387 మందికి కాన్పులు చేశారు.

జిల్లాలోని పీహెచ్‌సీలో 1,059 సాధారణ కాన్పులు కావ‌డం విశేషం. జిల్లాలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు చేస్తున్నారు. ఈ ఎనిమిది నెలల్లో కాలంలో 1,059 మందికి సాధారణ కాన్పులు ఉన్నాయి. అందులో నవాబుపేట ఆసుపత్రిలో అత్యధికంగా 241, దేవరకద్రలో 220 సాధార‌ణ ప్రసవాలు చేశారు.

Telangana: ఐటీలో దూసుకెళ్తున్న తెలంగాణ‌.. 12.98% పెరుగుద‌ల: క్రెడాయ్-అనరాక్ స‌ర్వే


అయితే భూత్పూర్ ఆస్పత్రి (Hospitals) లో మాత్రం ఒక సాధారణ కూడా నమోదు కాలేదు. ఆ ప్రాతంలో అన్ని సిజేరియ‌న్‌లే కావ‌డం విశేషం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గర్భిణులకు వీలైనంతవరకూ సుఖప్రసవం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీఎంహెచ్ఓ డాక్ట‌ర్ కృష్ణ అన్నారు. గ‌ర్భిణుల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నామని ఆయ‌న తెలిపారు. ప్ర‌స‌వం అయ్యే వ‌ర‌కు ఆశ కార్య‌క‌ర్త‌లు వారి యోగ క్షేమాల‌ను ప‌ర్య‌వేక్షించేలా చూస్తున్నామ‌ని డీఎంహెచ్ఓ తెలిపారు.

కేసీఆర్ కిట్‌ల అంద‌జేత‌..

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఉచిత ప్ర‌స‌వాలే కాకుండా మ‌హిళ‌ల‌కు ప్ర‌స‌వానంత‌రం కేసీఆర్ కిట్‌లు (KCR KIT) అంద‌జేస్తున్నామ‌ని డీఎంహెచ్ఓ డాక్ట‌ర్ కృష్ణ తెలిపారు. కేసీఆర్ కిట్‌తో పాటు ఆర్థికంగా చేయూత‌ను కూడా ప్ర‌భుత్వం అందించ‌డంతో మ‌హిళ‌లు ఎక్కువ‌గా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌వైపు మొగ్గు చూపుతున్నార‌ని అన్నారు.

AIIMS Recruitment 2021: ఎయిమ్స్‌లో 118 ఉద్యోగాలు.. అర్హ‌త‌, వేత‌నం.. ద‌ర‌ఖాస్తు విధానం


ప్ర‌స‌వాల వివ‌రాలు..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలల వారీగా ప్రసవాలు..

ఏప్రిల్ 883, మే.905, జూన్.882, జులై 1,029, ఆగస్టు 999, సెప్టెంబర్ 1,148 అక్టోబర్ 1,139, నవంబర్ 1,118గా న‌మోదయ్యాయి. ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు రావ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారని అధాకారులు చెబుతున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తోపాటు.. నాణ్య‌మైన వైద్యం ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు వ‌చ్చేలా చేస్తున్నాయ‌ని అధికారుల చెబుతున్నారు.

-  స‌య్య‌ద్‌, న్యూస్ 18 మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌

First published:

Tags: Hospitals, Mahabubnagar, Telangana, Telangana health department

ఉత్తమ కథలు