Home /News /telangana /

GOVERNMENT EMPLOYEE HAS ILLEGAL WEAPONS AND ARRESTED VRY

Vikarabad : ప్రభుత్వ ఉన్నతాధికారి ఇంట్లో మారణాయుధాలు ..అరెస్ట్

ప్రభుత్వ ఉన్నతాధికారి ఇంట్లో మారణాయుధాలు ..అరెస్ట్

ప్రభుత్వ ఉన్నతాధికారి ఇంట్లో మారణాయుధాలు ..అరెస్ట్

Vikarabad : ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి..అధికారం ఉందని రెచ్చిపోయాడు..తనకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చాడు. మూత్రానికి వెళ్లిన యువకున్ని తుపాకితో కాల్చివేస్తానని బెదిరించాడు.. మరోవైపు చట్టవ్యతిరేకంగా తన ఇంట్లో మారణాయుధాలు సైతం పెట్టుకుని ఓ బొమ్మ తుపాకిని ఇంట్లో పెట్టుకుని హల్‌చల్ చేశాడు.

ఇంకా చదవండి ...
ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి..అధికారం ఉందని రెచ్చిపోయాడు..తనకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చాడు. మూత్రానికి వెళ్లిన యువకున్ని తుపాకితో కాల్చివేస్తానని బెదిరించాడు.. మరోవైపు చట్టవ్యతిరేకంగా తన ఇంట్లో మారణాయుధాలు సైతం పెట్టుకుని ఓ బొమ్మ తుపాకిని ఇంట్లో పెట్టుకుని హల్‌చల్ చేశాడు.

సమాజంలో భాద్యతగా ఉండాల్సిన ఎమ్మార్వో రౌడీలా వ్యవహరించాడు..దీంతో అసలు రూపం బయటపడి పోలీసుకేసుల్లో ఇరుక్కున్నాడు. వివరాల్లోకి వెళితే..వికారాబాద్ షేక్ ఫయజ్ ఆహ్మద్, వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో డిప్యూటి తహసీల్దార్‌గా పని చేస్తూ.. పట్టణంలో సాకేత్‌నగర్ ‌లో నివాసం ఉంటున్నాడు. అయితే శుక్రవారం మద్యం మత్తులో ఉన్న ఫయజ్ అతని ఇంటికి సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్ వద్ద మూత్రం పోయడానికి వెళ్లగా అడ్డుపడి ఇష్టంవచ్చినట్టు తిట్టాడు. వెంటనే అక్కడి నుండి వెళ్లకపోతే...తుపాకితో కాల్చివేస్తానని బెదిరించాడు.

దీంతో బెదిరింపులకు గురైన ప్రణిత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అహ్మద్ ఇంటిని తనిఖీలు చేశారు. ఆయన ఇంట్లో తల్వార్ కత్తులు, ఎయిర్‌గన్‌తో పాటు పలు మారణాయుధాలు ఓ బొమ్మ తుపాకి లభించాయని పోలీసులు తెలిపారు...దీంతో ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అయితే ఫయాజ్ వద్ద నిజమైన తుపాకి ఉందని ..కాని పోలీసులు బోమ్మ తుపాకి ఉందని పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు స్థానికులు.
Published by:yveerash yveerash
First published:

Tags: Crime news, Vikarabad

తదుపరి వార్తలు