హోమ్ /వార్తలు /తెలంగాణ /

Independence Day 2022: ఆ గ్రామం స్వతంత్ర సమరయోధుల పుట్టినిల్లు ... ప్రభుత్వానికి మాత్రం కనిపించడం లేదు

Independence Day 2022: ఆ గ్రామం స్వతంత్ర సమరయోధుల పుట్టినిల్లు ... ప్రభుత్వానికి మాత్రం కనిపించడం లేదు

Freedom Fighters Village

Freedom Fighters Village

Independence Day 2022: స్వరాజ్యం కోసం ఎంతో మంది కలల కంటే ..దాన్ని సాధించడం కోసం మరెందరో ప్రాణత్యాగాలు చేశారు. బానిస సంకెళ్లను తెంచుకోవడానికి స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరాడిన వారెందరో ఉన్నారు. ఆ మహోధ్యమంలో కొందరు మహానుభావుల పేర్లు తెలిస్తే మరికొందరు బాహ్యప్రపంచానికి తెలియకుండా తెరమరుగైపోయారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India

(K.Veeranna,News18,Medak)

స్వరాజ్యం కోసం ఎంతో మంది కలల కంటే ..దాన్ని సాధించడం కోసం మరెందరో ప్రాణత్యాగాలు చేశారు. బానిస సంకెళ్లను తెంచుకోవడానికి స్వాతంత్య్ర ఉద్యమం(Freedom movement)లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరాడిన వారెందరో ఉన్నారు. ఆ మహోధ్యమంలో కొందరు మహానుభావుల పేర్లు తెలిస్తే మరికొందరు బాహ్యప్రపంచానికి తెలియకుండా తెరమరుగైపోయారు. సంగారెడ్డి(Sangareddy)జిల్లా జోగిపేట(Jogipet)మండలం అల్లాదుర్గం(Alladurgam)గ్రామానికి వెళ్తే ఎందరో త్యాగధనులు, స్వాతంత్య్ర ఉద్యమకారుల పేర్లు వినిపిస్తాయి.

Murder : మాజీ మంత్రి తుమ్మల అనుచరుడ్ని వేటాడి చంపిన దుండగులు .. అందరి అనుమానం అతనిపైనేగుర్తించే వారేరి..?

75సంవత్సరాల స్వాతంత్య్ర ఉద్యమం తర్వాత ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే నాడు స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన పౌరులు పుట్టిన గడ్డగా సంగారెడ్డి జిల్లాలోని అల్లాదుర్గం గ్రామం పేరు చెబుతుంటారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి పోరాటాలు చేశారు. బ్రిటీష్ పాలకులు, నైజాం నవాబులకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొని ప్రాణాలు అర్పిం చారు. అల్లదుర్గం గ్రామానికి చెందిన కొందరు స్వాతంత్య్ర సాధనే లక్ష్యంగా గ్రామ గ్రామన పర్యటించి ప్రజలను ఉద్యమంలో పాల్గొనేలా బుర్రకథలతో చైతన్య పరిచారు.

ఉద్యమాల పురిటిగడ్డ ..

వెంకటేశ్వర దేవాలయంలో ఈ ప్రాంత ఉద్యమకారులు సభలు, సమావేశాలు నిర్వహించే వారని ఇప్పటికి చెప్పుకుంటారు. స్వతంత్రం కోసం అల్లాదుర్గం గ్రామానికి చెందిన మజ్జిగ ఈశ్వరయ్య. మజ్జిగ లింగప్ప, అరిగే సదానందం, బోనకుర్తి బాలయ్య, బిచుక శంకరప్ప, మంకెన సంగయ్య, పల్లె లక్ష్మయ్య, పట్కారి దుర్గయ్య, పల్లె దుర్గయ్య, మోట్కురి లక్ష్మయ్య, కాల మాణయ్య పోరాడారు. అల్లాదుర్గానికి చెందిన 12 మంది స్వాతంత్య్రం పోరాటం చేశారు. ఇందులో అరిగే సదానందం అధ్యక్షతన పోరాటం ముందుకు సాగింది. జోగిపేట కేంద్రంగా స్వాతంత్య్ర సంగ్రామంలో సాగిన ఉద్య మంలో అల్లాదుర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుల్లో ప్రస్తుతం మజ్జిగ ఈశ్వరయ్య ఒక్కరే జీవించి ఉన్నారు. నాటి స్వాతంత్య్ర ఉద్యమ అనుభవాలను మీడియా తో వివరించారు.

ప్రజల్లోకి తీసుకెళ్లిందే అల్లాదుర్గం యోధులు..

స్వతంత్రం రాక ముందు పాలకులు అల్లాదుర్గంలో భజనలు, బుర్ర కథలు, సమావేశాలను నిషేధించారు. అయినా అందుకు దీటుగానే సమావేశాలు నిర్వహించి ఉద్యమంపై ప్రజలకు ఎప్పటికప్పుడూ తెలియజేస్తూ వచ్చారు ఇక్కడి పోరాట యోధులు. గోల్కొండ పత్రిక ద్వారా స్వాతంత్రోద్యమ విశేషాలు తెలుసుంటూ వాటిని తమ పద్యాలు పాటలు, బుర్రకథ రూపంలో ప్రజలకు తెలియజేసేవారు.

మోట్కూరి లక్ష్మయ్య ఇంట్లో రోజూ బుర్ర కథ నేర్చుకునే వాళ్లమని ... గ్రామంలో సొంతంగా గ్రంథాలయం ప్రారంభించామని మజ్జిగ ఈశ్వరయ్య తెలిపారు. 1946లో కంది గ్రామంలో స్టేట్ కాంగ్రెస్ మహాసభ నిర్వహించాలని అందుకు కావాల్సి విరాళాలు సేకరించిన విషయాన్ని గుర్తు చేశారు. గాంధీ విగ్రహ ప్రారంభోత్సవ శిలాఫలకం అల్లాదుర్గంలో 50 మంది వాలంటీర్లతో ఉద్యమాన్ని కొనసాగించారు నాటి స్వతంత్ర్య ఉద్యమకారులు. 15 పెద్ద కత్తులు, 40 బరిసెలు వెంటబెట్టుకొని తిరిగేవాళ్లమని మజ్జిగ ఈశ్వరయ్య తెలిపారు.

Independence Day 2022: స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయనో పోరాట యోధుడు .. కనీసం సొంత ఊరిలో కూడా ఒక్క విగ్రహం లేదుఆరు నెలలు జైల్లో ..

1947 మార్చి 21న కస్తూరి కృష్ణమాచారి అధ్యక్షతన అల్లాదుర్గంలో స్టేట్ కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ, ఆంధ్రరాష్ట్ర అధ్యక్షుడు జమలాపురం కేశవరావు, రమ్యత్ పత్రిక సంపాదకుడు మందుముల నర్సింగ్ రావు, స్టేట్ కాంగ్రెస్ కార్యదర్శి మాడపాటి రాంచందర్ రావు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, సభలు పెట్టినందుకు నిర్బంధించారు. సంగారెడ్డి జైలుకు తరలించి, అక్కడి నుంచి కర్నాటక రాష్ట్రం గుల్బార్గా జైలుకు తరలించారు. ఆరు నెలలు శిక్ష అనుభవించామని చెప్పారు.

భూములిచ్చినా తప్పని తిప్పలు..

ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద 1996లో రామచంద్రాపూర్ మండలం కొల్లూర్ గాంధీ విగ్రహం ఏర్పాటు అల్లాదుర్గంలో జాతీయ నాయకుల, స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతల విగ్రహాలు లేవు. ఏటా స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనే సమరయోధులు దీనిపై దృష్టి పెట్టారు. గ్రామానికి సమరయోధుడు అరిగే సదానందం సొంత నిధులతో బస్టాండ్‌లో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 2003లో అల్లాదుర్గం బస్టాండ్‌లో గాంధీ విగ్రహన్ని ఏర్పాటు చేశారు. సమరయోధులు పల్లె లక్ష్మయ్య జ్ఞాపకార్థం ఆయన భార్య గంగమ్మ విగ్రహానికి మెట్లు ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం వచ్చిందని వజ్రోత్సవాలు జరుపుకుంటున్న పాలకులు అందుకు కారణమైన యోధుల విగ్రహాల ఏర్పాటు చేయడంలో ..వారి కుటుంబాలను గుర్తించడంలో చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Independence Day 2022, Sangareddy, Telangana News

ఉత్తమ కథలు