హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మూసివేత...

హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డును మూసేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

news18-telugu
Updated: March 28, 2020, 3:40 PM IST
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మూసివేత...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డును మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రద్దీ లేని రోడ్డుపై వాహనాలు అతివేగంగా నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డును మూసేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసర వస్తువులను తరలించే వాహనాలకు మాత్రమే అనుమతినిచ్చింది. గోల్కండ ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఆరుగురు కూలీలు మరణించారు. ఈ ప్రమాదంతోపాటు ఓఆర్‌ఆర్‌ రోడ్డుపై మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతుండటాన్ని గమనించిన అధికారులు ఓఆర్‌ఆర్‌ ను మూసేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ఔటర్ రింగ్‌పై నిఘాను మరింతగా పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం మరికొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలను అమర్చాలని నిర్ణయించారు. ప్రజారవాణాను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది.


First published: March 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading