హోమ్ /వార్తలు /తెలంగాణ /

Raja Singh wife: బీజేపీ అధిష్టానానికి ఎమ్మెల్యే రాజాసింగ్​ సతీమణి లేఖ.. ఏం రాశారంటే..?

Raja Singh wife: బీజేపీ అధిష్టానానికి ఎమ్మెల్యే రాజాసింగ్​ సతీమణి లేఖ.. ఏం రాశారంటే..?

రాజాసింగ్​ (File Photo Credit:Twitter)

రాజాసింగ్​ (File Photo Credit:Twitter)

బీజేపీ (BJP) హైకమాండ్ రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై రాజాసింగ్​ సతీమణి బీజేపీ అధిష్టానానికి లేఖ రాశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సోషల్ మీడియాలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Rajasingh) పోస్టు చేసిన ఒక వీడియో వివాదాస్పదమై వైరల్ కావడంతో దుమారం చెలరేగింది.  దీంతో ఒక వర్గం ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ (BJP) హైకమాండ్ రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. అంతేగాక బీజేఎల్పీ పోస్ట్ నుంచి రాజాసింగ్‌ను అధిష్టానం తప్పించింది.  అయితే ఈ విషయంపై రాజాసింగ్​ సతీమణి  (Raja Singh Wife) బీజేపీ అధిష్టానానికి లేఖ రాశారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఆయన సతీమణి ఉషాబాయి కోరారు. గడువు రేపటితో ముగియనుండటంతో బీజేపీ క్రమశిక్షణ కమిటీకి ఉషాబాయి లేఖ (letter) రాశారు. రాజాసింగ్ జైలులో ఉన్నారని తన సస్పెన్షన్ రేపటితో ముగియనుండటంతో సమయం ఇవ్వాలని కోరారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ని ఇటీవల పీడీ చట్టం కింద పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉన్నారు.

ఆ పదవి ఎవరికి..?

వివాదాస్పద వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. ఈసారి ఆయనపై బీజేపీ అధినాయకత్వం సీరియస్ అయ్యింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేత(BJP LP Leader) పదవి కూడా పోయింది. ఒకవేళ ఆయనను బీజేపీ మళ్లీ పార్టీలోకి తీసుకున్నా.. శాసనసభాపక్ష నేత పదవి మాత్రం ఆయనకు దక్కే అవకాశాలు లేవన్నది పలువురి విశ్లేషణ. ఈ నేపథ్యంలో ఈ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీ తరపున రాజాసింగ్ ఒక్కరే గెలిచారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పలుసార్లు గెలిచింది.

దుబ్బాకలో(Dubbaka) బీజేపీ తరపున పోటీ చేసిన రఘునందన్ రావు(Raghunandan Rao), హుజూరాబాద్‌లో(Huzurabad) కమలం పార్టీ తరపున బరిలోకి దిగిన ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్‌పై విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గెలిచినా.. శాసనసభాపక్ష నేతగా మాత్రం రాజాసింగ్ కొనసాగుతూ వస్తున్నారు. అయితే రాజాసింగ్ ఆ పదవిలో ఉండగానే.. మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ పదవిని ఆశించినట్టు వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఆయన పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

Ganesh Chaturthi 2022: ఇదెక్కడి దొంగతనంరా బాబు.. చిన్నారులు ఏర్పాటు చేసుకున్న విగ్రహం చోరి

రాజాసింగ్‌కు తెలుగు భాషపై పట్టు లేకపోవడంతోపాటు వివిధ అంశాలపై అవగాహన లేకపోవడంతో శాసనసభాపక్ష నేతగా తనకు అవకాశం ఇవ్వాలని రఘునందన్ రావు పార్టీ నేతలను కోరినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. కానీ ఆయన ఆశించినట్టు జరగలేదు. అయితే తాజాగా రాజాసింగ్‌ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో.. ఆయన స్థానంలో శాసనసభాపక్ష నేతగా ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికప్పుడు ఈ పోస్టులో ఎవరో ఒకరిని నియమించాల్సిన అవసరం బీజేపీకి లేకపోయినా.. ఎవరో ఒకరికి ఆ అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లో ఎవరికి ఆ ఛాన్స్ వస్తుందా ? అని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

First published:

Tags: Bjp, Hyderabad, Raja Singh

ఉత్తమ కథలు