GOSHAMAHAL BJP MLA RAJA SINGH HAS LEVELED SERIOUS ALLEGATIONS AGAINST THE TELANGANA GOVERNMENT FOR ALLOTTING HIM A SCRAP BULLET PROOF CAR PRV
Raja Singh fires on Telangana govt: బీజేపీ ఎమ్మెల్యేలు ఉగ్రవాదుల చేతుల్లో చచ్చినా పర్లేదా? తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ధ్వజం
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉగ్రవాదుల నుంచి ప్రాణాపాయ ముప్పున్న తనకు బుల్లెట్ ప్రూఫ్ కారని చెబుతూ.. పాత స్క్రాప్ నుంచి తీసిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారునే ఇచ్చారని రాజాసింగ్ మండిపడ్డారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal BJP MLA Raja singh) తెలంగాణ ప్రభుత్వం (Telangana government)పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉగ్రవాదుల నుంచి ప్రాణాపాయ ముప్పున్న తనకు బుల్లెట్ ప్రూఫ్ కారని చెబుతూ.. పాత స్క్రాప్ నుంచి తీసిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారునే ఇచ్చారని రాజాసింగ్ మండిపడ్డారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న హెచ్చరికలతో ప్రభుత్వం తనకు సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు (Bullet Proof car) తరచూ మొరాయిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఎంతగా అంటే వాహనం ఎప్పుడు.. ఎక్కడ ఆగిపోతోందో తెలియడం లేదని రాజాసింగ్ (Raja singh) అన్నారు. ఫిర్యాదు చేస్తే తీసుకెళ్లి ఏదో మాడిఫికేషన్ చేసి దానినే పంపిస్తున్నారని అన్నారు. నేడు ఆయన హైదరాబాద్ (Hyderabad) నుంచి షాద్ నగర్ (Shadnagar) కు వెళ్లి వస్తుండగా తన బుల్లెట్ ఫ్రూఫ్ కారు రోడ్డుపై మొరాయించిందని ఆయన తెలిపారు. దీంతో కారు వద్దే నిలబడి మాట్లాడిన వీడియోను (Video) రాజాసింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనలేదని అన్నారు. చంద్రబాబు టైంలో కొన్నవే ఇప్పటికీ వాడుతున్నారని ఆరోపించారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఏవీ కొన్నట్లు లేదని.. పాత స్క్రాప్ లోంచి తీసిచ్చిన డొక్కు బుల్లెట్ ప్రూఫ్ కారునే తనకు అంటగట్టారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రభుత్వం తనకు సమకూర్చిన బుల్లెట్ ప్రూప్ వెహికిల్ ఇప్పటికి చాలా సార్లు ట్రబుల్ ఇచ్చిందన్నారు. తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తరచూ ట్రబుల్ ఇస్తోందని తాను ఇంటలిజెన్స్ ఐజీ, డీజీపీ దృష్టికి తీసుకెళ్లినప్పటికి స్పందించడంలేదని రాజాసింగ్ అన్నారు. తనకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు రాజాసింగ్. నాకు ఇలాంటి వాహనం ఎందుకిచ్చారో అర్థం కావడం లేదన్నారు. మేసేజీలు పెడితే వచ్చి తీసుకెళ్లి రిపేర్లు చేసి మళ్లీ అదే వెహికల్ ఇస్తున్నారని.. తనకు చేస్తే చేశారు కానీ.. వేరె ఎవరికీ ఇలాంటి వాహనాలు ఇవ్వొద్దని రాజాసింగ్ పోలీసులకు సూచించారు.
పార్లమెంట్ బరిలో రాజాసింగ్..?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్లమెంటు సీటుపై కన్నేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు గోరక్షా గోషా మహల్ చాలు అనుకున్న రాజాసింగ్ ఇక పార్లమెంట్ బాట పట్టాలనుకుంటున్నారట. ఇందుకోసం ఇప్పటి నుంచే ఆయన కసరత్తు ప్రారంభించారు. బలమైన అభ్యర్థులను పార్లమెంటుకు పోటీ చేయించాలని బీజేపీ కూడా భావిస్తోంది. దీంతో 2024లో రాజాసింగ్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖాయమే అని సమాచారం. ఈ క్రమంలో తాను పోటీ చేయాలనుకుంటున్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన రౌండ్స్ వేస్తున్నారట. ఈ మధ్యకాలంలో జనానికి దగ్గరయ్యే యత్నాలు కూడా చేస్తున్నారట.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.