హోమ్ /వార్తలు /తెలంగాణ /

MLA Raja Singh video: అరెస్టుకు ముందు వీడియో విడుదల చేసిన రాజాసింగ్​.. ఆ వీడియోలో ఏముందంటే?

MLA Raja Singh video: అరెస్టుకు ముందు వీడియో విడుదల చేసిన రాజాసింగ్​.. ఆ వీడియోలో ఏముందంటే?

రాజాసింగ్​ (Photo Credit:Twitter)

రాజాసింగ్​ (Photo Credit:Twitter)

ఎమ్మెల్యే రాజాసింగ్​ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, అరెస్టుకు ముందు గురువారం రాజాసింగ్​ మరో వీడియోను మీడియాకు విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో ఏముంది?

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  స్టాండప్​ కమెడియన్​ మునావర్​ ఫారుఖీ షో విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja singh) వీడియో విడుదల చేయడంతో పెద్ద దుమారమే చెలరేగింది. దాంట్లో ముస్లింలను, మహ్మద్​ ప్రవక్తను అవమానించారంటూ ఆయనపై పలు సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాశం అయింది. దీంతో రాజాసింగ్​ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, అరెస్టుకు ముందు (Before Arrest) గురువారం రాజాసింగ్​ మరో వీడియోను మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు టీఆర్ఎస్ (TRS), ఎంఐఎంలే (MIM) కారణమని రాజాసింగ్ ఆరోపించారు. హైద్రాబాద్ (Hyderabad) లో ఆందోళనలు, విధ్వంసాలు చేస్తున్నవారిని ఎంఐఎం నడిపిస్తుందని ఆయన ఆరోపించారు.  సీఎం కేసీఆర్​ (CM KCR) అత్యవసరంగా మీటింగ్​ ఏర్పాటు చేసి తనను జైల్లో పెట్టాలని చూస్తున్నారని, పీడీ యాక్డులు పెట్టేలా ప్లాన్​లు చేస్తున్నారని ఆయన అన్నారు.  మునావర్ షో వద్దని చెప్పినా కూడా ప్రభుత్వం వినలేదని రాజాసింగ్ ఆ వీడియో (Raja singh Video)లో పేర్కొన్నారు. ఈ షో కారణంగానే హైద్రాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయన్నారు. సీతా దేవి,శ్రీరాముడిని దూషించిన మునావర్ సో వద్దని చెప్పినా కూడా ఈ షో ను నిర్వహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించిందని ఆయన విమర్శించారు. ఐదు వేల మందితో ఈ షో ను నిర్వహించారని రాజాసింగ్ ఆరోపించారు. శాంతి భద్రతలు ఎందుకు క్షిణించాయో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.


  Raja singh: BJP ఎమ్మెల్యే రాజాసింగ్​ చుట్టు ఉచ్చు బిగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం!


  రాజాసింగ్‌పై 101 కేసులు..


  కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌ చేయడమే కాదు ఆయనపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు పోలీసులు. 2004 నుంచి రాజాసింగ్‌పై 101 కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 18 కేసులు కేవలం మత‌ప‌ర‌మైన‌ విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవే కావడం విశేషం. పీడీయాక్టు న‌మోదుతో రాజాసింగ్‌కు బెయిల్ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల చ‌రిత్ర‌లోనే ఒక ఎమ్మెల్యేపై పీడీయాక్టు న‌మోదు కావ‌డం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీయాక్ట్ న‌మోదు చేసిన మంగళహాట్‌ పోలీసులు చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bjp, Hyderabad, Raja Singh, Telangana bjp, Video

  ఉత్తమ కథలు