తెలంగాణ(Telangana)లో చాలా మంది కొత్త రేషన్ కార్డుల (Telangana Ration cards) కోసం ఎదురుచూస్తున్నారు. రేషన్ కార్డు లేపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఇస్తుందా? అని వెయిట్ చేస్తున్నారు. అలాగే కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వీటిపై అధికారులు, నేతలకు ఫిర్యాదు ఎక్కువగా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ (Minisrer KTR) శుభవార్త చెప్పారు. జూలై ఆఖరి నుంచి ఆగస్టులోగా రాష్ట్రంలోని అర్హులకు కొత్తగా ఆసరా పింఛన్లు, రేషన్ కార్డుల ఇస్తామని తెలిపారు. గడపగడపకూ వెళ్లి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని సమస్యలు వచ్చినా.. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ఫించన్ల కోసం రూ.10వేల కోట్లను ఖర్చుచేస్తున్నామని చెప్పుకొచ్చారు. శనివారం నాగర్‌కర్నూల్ (KTR Nagar Kurnool Tour) జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. కొల్లాపూర్‌లో గోపల్‌దిన్నె, సింగోటం లింక్ కెనాల్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లిలో మార్కండేయ రిజర్వాయర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బహిరంభ సభలో మాట్లాడిన ఆయన.. కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లపై ప్రజలకు హామీ ఇచ్చారు.
తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల.. కొనసాగుతున్న కొలువులు జాతర.. వివరాలివే
ప్రస్తుతం తెలంగాణలో 60ఏ ళ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్లు (Aasara Pensions) ఇస్తున్నారు. ఆ వయసును 57కి తగ్గించారు సీఎం కేసీఆర్ (CM KCR). 57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. చట్ట సభల్లో కూడా ప్రకటించారు. అర్హులైన వారందరి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 57 ఏళ్లు నిండినవారు ఆసరా పథకానికి కు అర్హులు. ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారిస్తారు. దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదు. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు మించి ఉండకూడదు. ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నా పెన్షన్ రాదు. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి ఉన్నవారు ఆసరా పెన్షన్‌కు అనర్హులు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఆసరా పెన్షన్లు ఇవ్వరు. అంతేకాదు .. తమ పేరిట హెవీ వెహికిల్స్ ఉన్నా, ఐటీ రిటర్నులు దాఖలు చేసినా పెన్షన్ పథకం వర్తంచదు. లబ్ధిదారుల సంతానం ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులై ఉండరాదు. 57 ఏళ్లు నిండి, ప్రభుత్వం సూచించిన అన్ని అర్హతలు కలిగిన వారికే పెన్షన్ ఇస్తారు. అర్హులైన వారిలో చాలా మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. వారంతా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
అటు రేషన్ కార్డుదారులకు కూడా తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. రేషన్ కార్డు కలిగి ఉండి కుటుంబ సభ్యులందరి పేర్లు రేషన్ కార్డులో లేకుంటే.. వారి పేర్లను యాడ్ చేయవచ్చు. కొత్తగా వివాహం అయినవారు వారి భార్య పేరు కాని, ఇటీవల పుట్టిన చిన్న పిల్లల పేర్లు కాని రేషన్ కార్డులో నమోదు చేసుకునే అవకాశం వచ్చింది. పాత లేదా కొత్త రేషన్ కార్డ్ నంబర్, రేషన్ కార్డులో నమోదు చేసుకునే వారి ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ బుక్ వివరాలతో రేషన్ కార్డులను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఐతే చాలా మంది కొత్త రేషన్ కార్డుల గురించి ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు ఇస్తారని నేతలను నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆగస్టులోగా కొత్త రేషన్ కార్డుల జారీ కూడా పూర్తవుతుందని హామీ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aasara Pension Scheme, KTR, Minister ktr, Ration cards, Telangana, Telangana ration card