Singareni Employees: సింగరేణి కార్మికులకు గుడ్​న్యూస్​.. బోనస్‌ల వివరాలు ఇవే.. ఒక్కో కార్మికునికి ఎంత చెల్లించనున్నారంటే..

సింగరేణి కార్మికులు(ఫైల్ ఫొటో)

సింగరేణి కార్మికులకు బోనస్‌కు సంబంధించి సంస్థ సీఎండీ శ్రీధర్ బుధవారం కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లాభాల బోనస్, దసరా అడ్వాన్స్, దీపావళి బోనస్‌ల చెల్లింపులకు సంబంధించిన వివరాలను ఆయన  వెల్లడించారు.

  • Share this:
    Bonus for Singareni employees: సింగరేణి కార్మికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణి కార్మికులకు బోనస్‌కు సంబంధించి సంస్థ సీఎండీ శ్రీధర్ బుధవారం కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు లాభాల బోనస్, దసరా అడ్వాన్స్, దీపావళి బోనస్‌ల చెల్లింపులకు సంబంధించిన వివరాలను ఆయన  వెల్లడించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో సింగరేణిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించారు. గతేడాది కంటే ఒకశాతం వాటాను అధికంగా పెంచారు. వీటిని దసరా కంటే ముందే చెల్లించాలని సీఎండీ శ్రీధర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. లాభాల వాటా బోనస్​నే దసరాలోపే చెల్లించాలని అన్నారు. సింగరేణి కార్మికుల (Singareni employees) సంక్షేమానికి ప్రభుత్వ కట్టుబడి ఉందని ఈ సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పారు.

    సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కార్మికులకు బోనస్‌కు సంబంధించి సింగరేణి సంస్థ నుంచి కీలక ప్రకటన వెలువడింది. సింగరేణి కార్మికులకు ఈ నెల 11న లాభాల బోనస్ చెల్లించనున్నట్టుగా సీఎండీ శ్రీధర్ (SCCL CMD N Sridhar) చెప్పారు. అలాగే ఈ నెల 8వ తేదీన దసరా అడ్వాన్స్ చెల్లించనున్నట్టుగా సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. ఇక, నవంబర్ ఒకటో తేదీన దీపావళి బోనస్ చెల్లించనున్నట్టు చెప్పారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.1.15లక్షల వరకు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. లాభాల బోనస్ రూ. 79.07 కోట్లు సంస్థ చెల్లిస్తుందని శ్రీధర్ చెప్పారు. దీపావళి బోనస్ రూ. 300 కోట్లు కార్మికులకు సంస్థ చెల్లిస్తుందన్నారు. 

    Peddapalli: చిన్నారికి ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లారు.. ఇంటికి తిరిగి వస్తుండగా..

    ఇక, నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని, సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తుందని అన్నారు. సింగరేణి కార్మికుల నైపుణ్యాన్ని, శక్తిని తప్పకుండా వినియోగించుకుంటాంమని చెప్పారు. బొగ్గుతవ్వకాల్లోనే కాకుండా ఇతర ఖనిజాల తవ్వకాలలో సింగరేణి కార్మికుల నైపుణ్యాన్ని వాడుకుంటామన్నారు. ఇందుకోసం ప్లాన్​ రెడీ అధికారులను సీఎం ఆదేశించారు. రిటైరయిన సింగరేణి కార్మికుల సేవలను వాడుకుని కార్పొరేట్ కంపెనీలు మైనింగ్​ రంగంలో లాభాలు సంపాదిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

    Dating: టైట్ జీన్స్‌ ధరించి డేటింగ్‌కు వెళ్లిన యువతి.. ఆ క్షణాలను ఎంజాయ్ చేయాలని అనుకుంది.. కట్ చేస్తే ఐసీయూలో..

    ఇక, ఈ ఏడాది సింగరేణి రూ.272.64 కోట్ల లాభాలు సాధించింది. ఇందులో 29శాతం వాటాగా రూ. 79. 7 కోట్లు కార్మికులకు ఇవ్వనున్నారు. సింగరేణిలో మొత్తం 43వేల మంది కార్మికులున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: