Home /News /telangana /

GOOD NEWS TO FARMERS ANOTHER NEW FACILITY INCLUDED IN TELANGANA DHARANI PORTAL SK

Dharani Portal: రైతులకు గుడ్ న్యూస్.. ధరణిలో మరో సదుపాయం.. వారందరికీ ఊరట

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dharani Portal: రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ధరణి పోర్టల్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చి.. రైతులకు శుభవార్త చెప్పింది.

    తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. తెలంగాణలో భూముల  వివాదాలే ఉండకూడదని.. అన్ని లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో దీనిని రూపొందించారు. అన్ని భూ సమస్యలకు ధరణియే పరిష్కారమని ప్రభుత్వం చెబుతోంది. కానీ ధరణి వల్ల మరికొన్ని కొత్త సమస్యలు వచ్చాయి. పాస్‌బుక్‌లు అందక.. వచ్చినా అందులో సరైన వివరాలు లేక.. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఎంతో మంది రైతు బంధుకు కూడా దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ధరణి పోర్టల్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చి.. రైతులకు శుభవార్త చెప్పింది.

    ధరణి రికార్డుల్లో యజమాని పేరుకు బదులు 'ఇల్లు/ ఇంటి స్థలం' అని నమోదైన భూముల‌పై వినతులకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో యజమానులు అందుబాటులో లేకపోవడం, సరైన పత్రాలు చూపెట్టకపోవడం లేదా అధికారుల తప్పిదం వల్ల కొన్ని సర్వే నంబర్లలోని భూములకు రైతు పేరుకు బదులుగా ‘ఇల్లు’ లేదా ‘ఇంటి స్థలం’ అని నమోదైంది. అంతేకాదు ఏదైనా సర్వే నెంబరులో కొత్త భాగం ఇళ్ల స్థలాలుగా మారినా.. వ్యవసాయేతర భూమిగా వర్గీకరించినా.. ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని ధరణి పోర్టల్‌లో ఇంటి స్థలంగానో.. వ్యవసాయేతర భూమిగానో చూపిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఊరట కల్పిస్తూ.. కొత్త సదుపాయం తెచ్చారు.  వీటిని సవరించుకునేందుకు ధరణిలో ‘ఇష్యూ ఆఫ్‌ పీపీబీ ఆర్‌ నాలా కన్వర్షన్‌ వేర్‌ పట్టాదార్‌ నేమ్‌ ఈజ్‌ షోన్‌ యాజ్‌ హౌజ్‌/హౌజ్‌ సైట్‌’ అనే పేరుతో ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

    Telangana: రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన

    ఎలా దరఖాస్తు చేయాలి?

    పలానా సర్వే నెంబర్‌లోని భూమి నాలా, ఇళ్లు, ఇళ్ల స్థలాల పరిధిలోకి రాదంటూ.. వాటికి సరైన ఆధారాలతో ధరణి పోర్టల్‌లో లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

    పట్టాదారు వివరాలు, భూమి వివరాలు, పాత పాస్‌బుక్‌, రిజిస్ట్రేషన్‌ పత్రాలు వంటి యాజమాన్యాన్ని నిర్ధారించే పత్రాలు, ఆ భూమి ఫొటో లేదా వీడియోను జత చేయాల్సి ఉంటుంది.

    TSRTC: తెలంగాణ ఆర్టీసీకి సీఎం కేసీఆర్ బిగ్ షాక్... నాలుగు నెలలే గడువు

    రైతులతోపాటు సంస్థలకు కూడా ఈ వెసులుబాటు ఉంటుంది. అప్లికేషన్‌ పూర్తి కాగానే రిజిస్టర్డ్‍ మొబైల్‌ నంబర్‌కు SMS  వస్తుంది. ఆ తర్వాత బయోమెట్రిక్‌ అథెంటిఫికేషన్‌ చేయాలి.

    సొంతంగా ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునేవారు సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ పూర్తి చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్‌ పూర్తయ్యాక దరఖాస్తు నేరుగా  జిల్లా కలెక్టర్‌ వద్దకు వెళ్తుంది.

    Wines Shop: మద్యం షాపు ఓనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

    కలెక్టర్‌ దానిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించడం లేదా తిరస్కరించడం చేస్తారు. ఒకవేళ అనుమతి వస్తే వెంటనే ఈ-పట్టాదార్ పాస్‌బుక్‌ మంజూరవుతుంది. గ్రీన్‌ కలర్ పాస్‌బుక్‌ను పోస్టు ద్వారా నేరుగా రైతు ఇంటికే పంపిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Agriculture, Dharani Portal, Farmers, Telangana

    తదుపరి వార్తలు