HOME »NEWS »TELANGANA »good news to all hyderabad people who travel in rtc city buses daily hsn

Hyderabad and TSRTC: హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి పండగలాంటి వార్త.. టీఎస్ఆర్టీసీ బంపరాఫర్

Hyderabad and TSRTC: హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి పండగలాంటి వార్త.. టీఎస్ఆర్టీసీ బంపరాఫర్
హైదరాబాద్ సిటీ బస్సు (ఫైల్ ఫొటో)

హైదరాబాద్ లోని బస్సు ప్రయాణికులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయింది. హైదరాబాద్ లో సిటీ బస్సుల్లో రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు మాత్రమే బస్సుల్లో ప్రయాణించేవారయితే పాస్ లను తీసుకోరు. అయితే రోజూ క్రమం తప్పకుండా బస్సులనే నమ్ముకుని ఉన్న వాళ్ల సంఖ్య సిటీలో తక్కువేమీ కాదు.

  • Share this:
    హైదరాబాద్: మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా.? ఉద్యోగానికో, కోచింగ్ కో, మరేదైనా పనికోసమో రోజూ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.? అలాంటి వాళ్ల కోసమే టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్ ను ప్రకటించింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రయాణికులకు అద్భుతమైన సౌలభ్యాన్ని అందిస్తోంది. దీంతో హైదరాబాద్ లోని బస్సు ప్రయాణికులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయింది. హైదరాబాద్ లో సిటీ బస్సుల్లో రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు మాత్రమే బస్సుల్లో ప్రయాణించేవారయితే పాస్ లను తీసుకోరు. అయితే రోజూ క్రమం తప్పకుండా బస్సులనే నమ్ముకుని ఉన్న వాళ్ల సంఖ్య సిటీలో తక్కువేమీ కాదు. వారంతా బస్ పాస్ లను తప్పకుండా తీసుకుంటుంటారు. బస్ పాస్ లను తీసుకునే ప్రయాణీకులకు ఆర్టీసీ పండగలాంటి వార్తను ప్రకటించింది.

    సిటీలో బస్ పాస్ తీసుకోవడమేనది ఓ పెద్ద ప్రయాసే అనే చెప్పుకోవచ్చు. బస్ కౌంటర్ కు వెళ్లాలి. వారు చెప్పిన టైమ్ లో లైన్లో నిల్చోవాలి. ఆ తర్వాత డబ్బులు చెల్లించి పాస్ ను తీసుకోవాలి. పాస్ గడువు ముగిసేలోపే ఈ ప్రక్రియ అంతా ముగించుకోవాలి. ఈ తతంగాన్నంతా తగ్గించి బస్ పాస్ ప్రక్రియను సులభతరం చేయాలన్న నిర్ణయానికి ఆర్టీసీ వచ్చింది. ప్రయాణికుల కష్టాలను తగ్గించేందుకు మార్గం సుగమం చేసింది. ఇకపై ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. బస్ పాస్ మీ ఇంటి వద్దకే నడుచుకుంటూ వస్తుంది.



    హైదరాబాద్ లోని ప్రజలకు ఆర్టీసీ గొప్ప శుభవార్త చెప్పింది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటికే బస్ పాస్ ను పంపించే విధంగా ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం బస్ పాస్ కావాలనుకున్న వారు 8008204216 నెంబర్ కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఏ మారు మూల ప్రదేశంలో ఉన్నా సరే, ఆర్టీసీ సిబ్బంది ఒకరు వచ్చి మీ వివరాలను తెలుసుకుని, బస్ పాస్ ను మీ ఇంటికే వచ్చి అందిస్తారు. అయితే దీనికి ఒకే ఒక్క కండీషన్ ను మాత్రం ఆర్టీసీ పెట్టింది. ఆయా ప్రాంతాల్లో కనీసం ఐదుగురయినా బస్ పాస్ ను తీసుకునేవారు ఉండాలన్న నిబంధనను మాత్రం ఆర్టీసీ పెట్టింది. ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకు ఈ ఫోన్ కాల్ సేవలు పనిచేస్తాయి. మరి ఈ సౌకర్యం కల్పించాము కదా అని బస్ పాస్ కౌంటర్లను అయితే ఆర్టీసీ తీసేయలేదని తేల్చిచెప్పింది.

    ప్రస్తుతం ఆర్టీసీ ఆర్డినరీ బస్ పాస్ ధర 950 రూపాయలుగా ఉంది. మెట్రో ఎక్స్ ప్రెస్ ధర రూ.1070, మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర రూ.1185, ఎయిర్ పోర్ట్ పుష్పక్ పాస్ ధర 2625, ఎన్జీవో ఆర్డినర్ పాస్ ధర రూ.320, ఎన్జీవో మెట్రో ఎక్స్ ప్రెస్ ధర 450 రూపాయలు, ఎన్జీవో మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర 575 రూపాయలుగా ఉందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
    Published by:Hasaan Kandula
    First published:January 08, 2021, 11:27 IST