పసుపు రైతులకు బీజేపీ ఎంపీ శుభవార్త..

పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు కల్పించేలా కేంద్రం అడుగులు వేస్తోందని వెల్లడించారు. పసుపు దిగుమతిని నిలిపివేయాలని కోరామని.. పసుపు పంటకు మద్దతు ధర చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: December 13, 2019, 4:48 PM IST
పసుపు రైతులకు బీజేపీ ఎంపీ శుభవార్త..
పసుపు రైతులు (ఫైల్ ఫొటో)
  • Share this:
పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు పంటకు మద్దతు ధర కోసం నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పసుపు రైతులు జనవరిలో శుభవార్త ఉంటారని తెలిపారు. పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు కల్పించేలా కేంద్రం అడుగులు వేస్తోందని వెల్లడించారు అరవింద్. పసుపు దిగుమతిని నిలిపివేయాలని కోరామని.. పసుపు పంటకు మద్దతు ధర చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు తెలంగాణకు IIM (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్), IISER (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు అరవింద్.

Telangana news,telangana cabinet,bodhan mla shakeel,Trs mla shakeel ahmed,shakeel meets d arvind, bodhan mla, ktr, cm kcr, nizambad mp, mp dharmapuri aravind, bjp, trs, telangana news, టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, బోధన్ ఎమ్మెల్యే, కేటీఆర్, కేసీఆర్, ఎంపీ ధర్మపురి అరవింద్
ధర్మపురి అరవింద్


కాగా, లోక్ ‌సభ ఎన్నికల సమయంలో పసుపు రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు కోరుతూ వినూత్న నిరసన చేపట్టారు. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో రైతులు పోటీ చేశారు. కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్‌లో ఓడిపోవడానికి పసుపు అంశం కూడా ఒక కారణం. అదే సమయంలో ధర్మపురి అరవింద్.. తనను గెలిపిస్తే నెల రోజుల్లోనే పసుపు తీసుకొస్తానని ఎన్నికల ప్రచారంలో తెలిపారు. పసుపు బోర్డు రాకుంటే రాజీనామా చేస్తానని పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా ఏటా ఉత్పత్తయ్యే పసుపు భారత్ వాటా 80శాతం ఉంది. ఇక దేశంలో పండించే పసుపులో తెలంగాణ వాటా 13శాతం ఉంటుంది. అందులోనూ నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువగా పసుపును పండిస్తారు. ప్రస్తుతం క్వింటాల్ పసుపు ధర రూ.4,500-6,500 పలుకుతోంది. పసుపు పంటపై లక్షలకు లక్షలు పెట్టుబడి పెడుతున్నామని..ఈ ధర తమకు ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి డబ్బులు కూడా రాక..అప్పుల పాలవుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. క్వింటాల్‌కు రూ. 10,000 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: December 13, 2019, 4:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading