యదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక స్పీడ్ పోస్టులో లడ్డూ ప్రసాదం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవాదాయ శాఖ గుడ్ న్యూస్‌ను అందించింది. భక్తులు కోరుకున్న ప్రసాదం, అక్షితలు, కుంకుమను స్పీడ్ పోస్టులో అందించేలా ఏర్పాట్లు చేయనుంది.

news18-telugu
Updated: February 10, 2020, 1:17 PM IST
యదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక స్పీడ్ పోస్టులో లడ్డూ ప్రసాదం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవాదాయశాఖ గుడ్ న్యూస్‌ను అందించింది. త్వరలోనే స్వామిఅమ్మవార్ల ప్రసాదంతో పాటు అక్షితలు, కుంకుమను నేరుగా భక్తుల ఇంటికి చేర్చేలా నిర్ణయం తీసుకున్నారు. స్పీడ్ పోస్టులో తపాలాశాఖ ఈ సేవలను భక్తులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులు పోస్టల్(తపాలా) శాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే భక్తులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్క యాదాద్రిలోనే కాకుండా బాసర, భద్రాచలం, వేములవాడ సహా మరో 10 ఆలయాల నుంచి భక్తుల కోరుకున్న విధంగా ప్రసాదం, అక్షితలు, కుంకుమను స్పీడ్ పోస్టులో ఇంటికి పంపేలా తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ సేవలను పొందేందుకు చెల్లింపులను నెట్ బ్యాంకింగ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ పద్ధతుల్లో స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చెల్లింపులను పోస్టల్ శాఖ బరువు ఆధారంగా నిర్ణయించనుంది. ఈ సేవలు ఫిబ్రవరి నెలాఖరుకల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Published by: Vijay Bhaskar Harijana
First published: February 10, 2020, 10:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading