Home /News /telangana /

GOOD NEWS FOR WOMEN TSRTC IS PROVIDING PARCEL SERVICES ON THE OCCASION OF RAKHI FESTIVAL PRV

TSRTC: మహిళలకు టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్​.. రాఖీ పండుగ కానుకగా మరో ఆఫర్​..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవలె మ‌ద‌ర్శ్ డే ని పుర‌స్క‌రించుకుని వారికి ప్ర‌త్యేకంగా ఉచిత ప్ర‌యాణ స‌దుపాయాన్ని క‌ల్పించింది. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ.. మహిళలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.

    తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) సామాజిక దృక్ఫ‌థంతోను అడుగు ముందుకేస్తోంద‌ని, ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో ప్ర‌త్యేక రాయితీలు కూడా క‌ల్పిస్తున్న వైనాన్ని ఆర్టీసీ అధికారులు గుర్తు చేశారు. ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డేతో పాటు నిరుద్యోగ యువతకు సైతం ఛార్జీలో రాయితీ ప్రకటించింది టీఎస్‌ ఆర్టీసీ. అమ్మ అనురాగాన్ని, ప్రేమ‌ను వెల‌క‌ట్ట‌లేమంటూ ఆ త్యాగ‌మూర్తి సేవ‌ల‌ను గుర్తించుకుని మ‌ద‌ర్స్​ డే ని పుర‌స్క‌రించుకుని వారికి ప్ర‌త్యేకంగా ఉచిత ప్ర‌యాణ స‌దుపాయాన్ని క‌ల్పించింది. తాజాగా రాఖీ పౌర్ణమి (Rakhi Festival) సందర్భంగా ఆర్టీసీ.. మహిళలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆడపడుచులు వారి సోదరులకి రాఖీ (Rakhi) పండుగను పురస్కరించుకుని స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని సందర్భంలో తెలంగాణ టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలలో రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొంది.

    టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసులను (Cargo parcel services)  హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో డోర్ డెలివరీ (Door deliver) సదుపాయం కల్పించింది. ఈ సందర్భంగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ (సేల్స్ అండ్ గవర్నమెంట్) జి. జగన్, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కి సంబంధించిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సేవల గురించి విస్తృత ప్రచారం చేశారు. మరింత సమాచారం కోసం 9154298858, 9154298829 నంబర్లలో సంప్రదించవచ్చని టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది.



    ఆర్టీసీ బస్సుల్లో ట్రాకింగ్‌ వ్యవస్థ..

    బస్సు కోసం గంటల తరబడి ఎదురిచూసే పని లేకుం డా ఆర్టీసీ బస్సుల్లో ట్రాకింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ట్రాకింగ్‌ యాప్‌ ద్వారా బస్సు ఎక్కడున్నది? ఎప్పుడు వస్తుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ‘టీఎస్‌ ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌’ పేరుతో గూగు ల్‌ ప్లేస్టోర్‌లో మొబైల్‌ యాప్‌ను సంస్థ వైస్‌ చైర్మన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ ఇటీవలె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ యాప్‌ ప్రయాణికులు బస్‌ స్టాప్‌లు/బస్‌స్టేషన్లలో నిరీక్షించే సమయాన్ని నివారించడానికి, వారి ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవడానికి దోహ దపడుతుందన్నారు.

    ప్రయోగాత్మకంగా 140 బస్సులను గుర్తించామని, వీటిలో కంటోన్మెంట్‌, మియాపూర్‌-2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్‌ బస్సులు, శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇతర సుదూర ప్రాం తాలకు నడుపుతున్న మియాపూర్‌-1 డిపోకు చెందిన 100 బస్సుల్లో ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం రూట్లలో నడుస్తున్న పికెట్‌ డిపో బస్సుల్లో ఇప్పటికే ట్రాకింగ్‌ నడుస్తున్నదని, మరో రెండు నెలల్లో జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో అన్ని రిజర్వేషన్‌ సేవలు, ప్రత్యేక తరహా సేవలను యాప్‌లో చేరుస్తామని చెప్పారు.

    రాష్ట్రవ్యాప్తంగా 96 డిపోలు, 4,170 బస్సుల్లో ట్రాకింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్‌ సిటీ, మెట్రో లగ్జరీ, మెట్రో డీలక్స్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌తోపాటు డిస్ట్రిక్ట్‌ సర్వీస్‌లకు వేర్వేరుగా ట్రాక్‌ చేయవచ్చని వివరించారు. విమానాశ్రయానికి 24/7 నడిచే ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ట్రాకింగ్‌ వ్యవస్థ ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. గరుడ ప్లస్‌, రాజధాని, సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసుల సమాచారాన్ని సైతం ట్రాక్‌ చేయొచ్చని చెప్పారు. గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా www.tsrtc. telangana.gov.inలో ఇచ్చిన లింక్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Rakhi purnima 2021, Telangana, Tsrtc, Women

    తదుపరి వార్తలు