హోమ్ /వార్తలు /తెలంగాణ /

Harish Rao: తెలంగాణ ప్రజలకు తీపికబురు..రూ. 3 లక్షల స్కీమ్ పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao: తెలంగాణ ప్రజలకు తీపికబురు..రూ. 3 లక్షల స్కీమ్ పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

మంత్రి హరీష్ రావు

మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇల్లు కట్టాలనుకునే వారికి మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) గుడ్ న్యూస్ చెప్పారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఇస్తామని అన్నారు. 

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇల్లు కట్టాలనుకునే వారికి మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) గుడ్ న్యూస్ చెప్పారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఇస్తామని మంత్రి అన్నారు. అయితే సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) పేర్కొన్నారు. సొంత స్థలం ఉండి కూడా ఇళ్లు లేని పేదలకు రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కట్టిన ఇళ్లను పంపిణీ త్వరలోనే పూర్తి కానుందని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) తెలిపారు.

Metro Employees Strike: హైదరాబాద్ మెట్రో ఉద్యోగుల సమ్మె..జీతాలు పెంచాలని విధుల బహిష్కరణ..ప్రయాణికుల ఇక్కట్లు

తెలంగాణ సర్కార్ రెండు పడకల ఇళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా నిరుపేదలకు ఇళ్లు కట్టించి లబ్దిదారులకు కేటాయిస్తుంది. ఈ ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుండగా..కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారి కల ఈ పథకంతో తీరుతుంది. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా సామాజిక వర్గాల వారిగా ఇళ్లను కేటాయిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని గ్రామాల్లో ఇండ్లు నిర్మాణం చేసి లబ్దిదారులకు కేటాయించారు. మరికొన్ని గ్రామాల్లో ఇండ్ల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుంది. మరికొద్దిరోజుల్లో ఇవి పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వనున్నారు.

ఓ వైపు తుమ్మల మరోవైపు పొంగులేటి..ఖమ్మంలో రాజకీయ కాక..వారి అడుగులు ఎటు?

ఇల్లు కాకుండా డబ్బులు..రూ. 3లక్షలు..

ఈ ఇండ్ల నిర్మాణంలో ప్రజల నుండి అనేక ఆరోపణలు వచ్చాయి. ఇళ్లు నాసిరకంగా ఉన్నాయని ఇష్టం ఉన్నట్టు కాకుండా నిబంధనల పరిధి మేర మాత్రమే నిర్మించాలన్న అంశంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా..డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. సొంతంగా జాగ ఉండి ఇళ్లు లేని వారికి ఈ నగదును అందజేయనున్నారు. వచ్చే ఎన్నికల్లోగా పేదలందరికీ ఇండ్లు ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి (Minister Harish Rao) వెల్లడించారు.

అయితే సంక్రాంతి తర్వాత ఈ కొత్త స్కీమ్ అందుబాటులోకి రానుండగా లబ్ధిదారుల ఎంపికకు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు లబ్ధిదారుల నుండి దరఖాస్తుల స్వీకరణ చేపట్టినా కూడా వారి దరఖాస్తుల పరిశీలన కావాల్సిన బడ్జెట్ కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోనే పేదలకు సొంత జాగాలో ఇల్లు కల నెరవేరబోతుంది. పేదలందరికీ ఇండ్లు ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ కొత్త స్కీమ్ ను తీసుకొచినట్లు తెలుస్తుంది.

First published:

Tags: Double bedroom houses, Harish Rao, Minister harishrao, Telangana

ఉత్తమ కథలు