Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచి రేషన్ కార్డుల పంపిణీ.. వచ్చే నెల నుంచే రేషన్

ప్రతీకాత్మక చిత్రం

New Ration Cards: కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు అగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

  • Share this:
    తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ఆదేశించారు. వీటి కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. జూలై 26 నుంచి 31 తారీఖు దాకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు అగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

    తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డు దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులను మంజూరు చేయాలని నెల క్రితమే జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను విచారించి అర్హులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అర్హత పొందిన 3,60,000 పైచిలుకు లబ్ధిదారులకు గుర్తించింది. వారికి రేషన్ కార్డులతో పాటు వచ్చే నెల నుంచి రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
    Published by:Kishore Akkaladevi
    First published: