హోమ్ /వార్తలు /తెలంగాణ /

Good News: విద్యావాలంటీర్లకు సర్కార్ గుడ్ న్యూస్..పెండింగ్ వేతనాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు

Good News: విద్యావాలంటీర్లకు సర్కార్ గుడ్ న్యూస్..పెండింగ్ వేతనాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విద్యావాలంటీర్లకు తెలంగాణ సర్కార్ తీపికబురు చెప్పింది. పెండింగ్ వేతనాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

విద్యావాలంటీర్లకు తెలంగాణ (Telangana) సర్కార్ తీపికబురు చెప్పింది. పెండింగ్ వేతనాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 20 జిల్లాలకు సంబంధించిన విద్యావాలంటీర్ల (Vidyavalenteerlu) కోసం రూ.5,76,99,000లను విడుదల చేసింది. 2019-20 విద్యా సంవత్సరంలో 3 నెలలకు జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి వేతనాలను విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన (Devasena) ఉత్తర్వులు జారీ చేశారు.

Govt Jobs 2022: డిగ్రీ అర్హతతో 20,000 పైగా జాబ్స్ ... రేపే లాస్ట్ డేట్

ప్రస్తుతం తెలంగాణలోని  (Telangana) అన్ని పాఠశాలల్లో సరైన స్టాఫ్ లేదు. దీనిని భర్తీ చేసేందుకు విద్యావాలంటీర్లను తీసుకోగా వారిని మధ్యలోనే తొలగించారు. కరోనా అనంతరం విద్యావాలంటీర్లను రెన్యూవల్ చేయకుండా కొత్త నియామకాలు జరపకుండా సర్కార్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. ఇక 2019-20 ఏడాదికి సంబంధించి విద్యావలంటీర్ల (Vidyavalenteerlu) వేతనాలను ఇన్నిరోజులుగా విడుదల చేయకపోవడంపై సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది.

మరోవైపు తెలంగాణలోని విద్యాసంస్థలకు ఇటీవలే ప్రకటించిన దసరా సెలవులు ముగిశాయి. దీంతో అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం (Schools Reopen) అయ్యాయి. విద్యార్థులకు ఏకంగా 15 రోజులు సెలవులు ఇవ్వడంతో తమ సొంతూళ్లకు వెళ్ళి తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా గడిపారు. ఇక ఇప్పుడు పాఠశాలలకు, కాలేజీలకు తిరిగి పయనమయ్యారు. కాగా దసరా పండుగ సందర్బంగా తెలంగాణలోని పాఠశాలలకు సెప్టెంబర్ 26 నుండి సెలవులు ప్రకటించగా..జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 2 నుంచి సెలవులు ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి పాఠశాలలకు ఏకంగా 15 రోజులు సెలవులు వచ్చాయి. దీనితో విద్యార్థుల సంతోషానికి అవధులు లేవు.

ఇన్ని రోజులు సెలవులు ఇవ్వడంపై NCERT విద్యాశాఖకు ప్రతిపాదనలను పంపించింది. దసరాకు కేటాయించిన 15 రోజుల సెలవులకు బదులు 9 రోజులు మాత్రమే ఇవ్వాలని విద్యాశాఖకు సూచించింది NCERT.  ఈ విద్యాసంవత్సరం ప్రకారం మొత్తం 230 పని దినాలు కాగా.. భారీ వర్షాల నేపథ్యంలో జులై 7 నుంచి 16 వరకు భారీ వర్షాల నేపథ్యంలో సెలవులను ప్రకటించడంతో పాటు జాతీయ సమైక్యత ఉత్సవాల నేపథ్యంలో ఒక రోజు సెలవును ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది.  విద్యాసంవత్సరం 7 రోజులు నష్టపోయిందని NCERT విద్యాశాఖకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ నష్టాన్ని తగ్గించడానికి దసరా సెలవులను సెప్టెంబర్ 26 నుంచి కాకుండా.. అక్టోబర్ 1 నుంచి 9 రోజుల పాటు 9వ తేదీ వరకు ఇవ్వాలని సూచించింది.  లేకుంటే.. రెండో శనివారాల్లో స్కూళ్లను నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని కోరింది. నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి ఏప్రిల్ లో ఐదు రోజుల పాటు రెండో శనివారాల్లో స్కూళ్లు నడిపాలని.. తద్వారా ఐదు రోజులు కలిసి వస్తుందని సూచించింది.  కానీ NCERT ప్రతిపాదనను రాష్ట్ర విద్యాశాఖ తోసిపుచ్చింది.

First published:

Tags: Telangana, Telangana schools

ఉత్తమ కథలు