Medak : పెళ్లికూతురు నగలు మాయం.. ఎత్తుకెళ్లింది కోతులా.. ? మనిషా..? అయోమయంలో బాధితుడు..!

ప్రతీకాత్మక చిత్రం

Medak : సమాజంలో అప్పుడుడప్పుడప్పుడు కొన్న విచిత్ర సంఘటనలు జరుగుతాయి..దీంతో అవి చర్చనీయాంశం అవుతాయి..అయ్యో ఇలా జరిగిందా అని చెప్పుకోవడం తప్ప..ఎలాంటీ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉండదు..అచ్చు ఇలాంటీ సంఘటన తెలంగాణ జిల్లాలో జరిగింది. పెళ్లి కోసం తీసుకు వెళుతున్న నగలను కోతులు మాయం చేశాయి..దీంతో రెఢిమేడ్ నగలతో పెళ్లి జరిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • Share this:
    మరో కొద్ది గంటల్లో పెళ్లి కోసం తీసుకువెళుతున్న నగలు మాయమయ్యాయి.. సంచిలో నగలు పెట్టుకుని బైక్‌పై వెళ్లిన బాధితుడు తీరా మండపానికి వెళ్లేసరికి నగలు కనిపించ లేదు.. బంగారం నగలు లేకుండా పెళ్లి జరగదు కాబట్టి రెడీమేడ్ నగలతో నెట్టుకువచ్చారు. అయితే నగలు ఎలా పోయాయి అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు..

    బాధితుడి కథనం ప్రకారం..మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని నర్సాపూర్ పట్టణానికి చెందిన వడ్ల నర్సింహ, కోడలు వివాహం అదే మండలంలోని అద్మాపూర్‌ గ్రామంలో ఈనెల 23న జరిగింది. అయితే ఆ పెళ్లి కుమార్తెకు సంబంధించి మేనమామ అయిదు తులాల నగలు చేయించి , బంగారు నగలతో పాటు కొన్ని బట్టలను బ్యాగులో పెట్టుకుని ఇంటి నుండి బైక్‌పై బయలు దేరాడు. ఈ క్రమంలోనే కొంత దూరం వెళ్లాక.. మరికొన్ని వస్తువులు గుర్తుకు రావడంతో తిరిగి నర్సాపూర్‌కు వెళ్లాడు. అనంతరం ఇంటిముందు బైక్‌పెట్టి ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికి కోతులు, బైక్‌పై ఉన్న బ్యాగులోని వస్తువులను చిందరవందర చేసి క్రింద పడేశాయి. అయితే అందులో బంగారం ఉందా లేదా అని చూసుకోని నర్సింహ, బట్టలు సర్థుకుని తిరిగి పెళ్లికి వెళ్లాడు.తీరా పెళ్లి మండపానికి వెళ్లే సరికి సంచిలో నగలు కనిపించలేదు..దీంతో చేసేదేమి లేక గిల్ట్ నగలతో పెళ్లి తంతును కానిచ్చారు.

    అయితే పెళ్లి అయిపోయిన తర్వాత నర్సింహ తిరిగి ఇంటికి చేరుకుని చుట్టుపక్కల వెతికాడు. కోతులు బట్టలు చిందరవందర చేయడంతో ఎక్కడైనా పడ్డాయని చూశాడు. కోతులు కవరు ఎత్తుకుని ఎక్కడైనా చింపి పడేస్తే..కనీసం బంగారు ముక్కలైనా కనిపిస్తాయనే ఆశతో వెతికినా కనిపించలేదు.. దీంతో అనుమానం వచ్చి తన ఇంటీకి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో పరీశీలించగా... ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఇంటి ముందు తచ్చాడుతు కనిపించినట్టు గమనించాడు. దీంతో స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి విషయాన్ని వివరించాడు.

    దీంతో సదరు ప్రభుత్వ ఉద్యోగిని ఎస్సై పిలిపించి విచారణ చేయడంతో.. తాము తీయలేదని చెప్పడంతో పాటు తనను అవమానిస్తూ మాట్లాడాడని నర్సింహ ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు విషయాన్ని బయట పెట్టాల్సిన పోలీసులు అజాగ్రత్తగా బంగారం పోగొట్టున్నందుకు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
    Published by:yveerash yveerash
    First published: