భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి.. కేంద్రం జలసంఘం హెచ్చరిక.. రాత్రి 9 గంటలకు..

గోదావరిలో పెరుగుతున్న వరద ఉధృతి(ఫైల్ ఫోటో)

1986లో సరిగ్గా ఇదే రోజును ప్రమాదకర స్థాయిలో గోదావరి నది ప్రవహించిందని వెల్లడించింది. ఇవాళ కూడా అదే పరిస్థితి రావచ్చని.. రాత్రి 9 గంటల తర్వాత గోదావరి మహోగ్రరూపం దాల్చవచ్చని పేర్కొంది.

  • Share this:
    దేశవ్యాప్తంగా వానల బీభత్సం కొనసాగుతోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు నిండు కుండల్లా కళకళలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి, కృష్ణా నదులు సైతం మహోగ్రరూపం దాల్చాయి. భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు భద్రాచలం వద్ద నీటి మట్టం 52 అడుగులు దాటింది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర జలసంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రమాదకర స్థాయి దాటవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం రాష్ట్రస్థాయి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. వరద బాధితులు సహాయం కోసం 040-423450624 నంబర్‌కు ఫోన్‌ చేయాలని పరిసర ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు. గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని తెలిపారు.

    గతంలో భద్రాచలం వద్ద గోదావరి నది అత్యధికంగా 56.6 అడుగుల మేర ప్రవహించిందని కేంద్రం జలసంఘం తెలిపింది. అదికూడా సరిగ్గా 1986లో సరిగ్గా ఇదే రోజును ప్రమాదకర స్థాయిలో గోదావరి నది ప్రవహించిందని వెల్లడించింది. ఇవాళ కూడా అదే పరిస్థితి రావచ్చని.. రాత్రి 9 గంటల తర్వాత గోదావరి మహోగ్రరూపం దాల్చవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఉత్తర కోస్తా, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్లోని గాంగ్ టక్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 9.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగస్ట్ 19 తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో నిన్న ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కూడా కురిశాయి. నేడు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published: